వీడియోః వర్మ మదర్స్ డే ట్వీట్‌ మరో లెవల్‌

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ ఏం చేసినా కూడా విభిన్నంగా ఉంటుందని మరోసారి నిరూపితం అయ్యింది.నేడు అంతర్జాతీయ మదర్స్ డే అనే విషయం తెల్సిందే.

 Ram Gopal Varma Happy Mothers Day Tweet-TeluguStop.com

ఈ రోజు ఆయన మదర్స్ డే సందర్బంగా అందరికి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశాడు.కుటుంబం మరియు బంధాలను పెద్దగా లెక్క చేయని వివాదాల దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ మదర్స్ డే సందర్బంగా శుభాకాంక్షలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటూ ఆయన పోస్ట్‌ చేసిన వీడియోను ప్లే చేస్తే అసలు విషయం క్లారిటీ వచ్చేసింది.

తల్లి కొడుకును వీరబాదుడు బాదుతున్న వీడియోను షేర్‌ చేశాడు.చెప్పుతో, కర్రతో, పొరకతో తల్లులు కొడుతున్న వీడియోను ఆయన షేర్‌ చేశాడు.

 Ram Gopal Varma Happy Mothers Day Tweet-వీడియోః వర్మ మదర్స్ డే ట్వీట్‌ మరో లెవల్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తల్లి కొడుకుల మద్య ప్రేమతో పాటు కొట్టుకోవడం కూడా ఉంటుంది.తల్లి కొడుకును మందలించేందుకు కొడుతూ ఉంటుంది.పెద్ద వాడు అయినా కూడా తప్పు చేస్తే కొడుతుంది.కాని ఈ రోజు అందరు కూడా మా అమ్మ గ్రేట్‌ అంటూ ట్వీట్స్ సోషల్‌ మీడియా షేర్స్‌ చేస్తూ ఉన్నారు.

కాని వర్మ మాత్రం నిజాయితీగా తల్లులు ప్రేమించడం మాత్రమే కాకుండా ఇలా కొట్టడం లో కూడా ముందు ఉంటారు అంటూ తనదైన శైలిలో చెప్పాడు.ఈ విషయమై ఆయన్ను చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు వర్మ ట్వీట్ ను సమర్ధిస్తే కొందరు మాత్రం మదర్స్‌ డే ను కూడా వదలని నీవు నీ తల్లికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ విమర్శించారు.వర్మ ను అంతగా విమర్శించేందుకు ఆయన తప్పు చేయలేదు.

ఆయన నిజాయితీగా తల్లులు కొడుకులను కొడతారు.అది కూడా మంచి కోసమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి వర్మ వీడియో ట్వీట్‌ వైరల్‌ అయ్యింది.

#Mothers Day #RamGopal #Ram Gopal Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు