శ్రీదేవి బయోపిక్ తీయకపోవడానికి కారణం ఇదే... అసలు విషయం బయట పెట్టిన వర్మ!

వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

 Ram Gopal Varma For Not Doing Sridevi Biopic Details, Ram Gopal Varma, Tollywood-TeluguStop.com

ఇలా తనకు తోచిన విధంగా మాట్లాడుతూ ఎన్నో వివాదాలకు కారణం అయ్యే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఏ పోస్ట్ చేసినా, ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ గా మారుతుంది.ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ డేంజరస్‌ అని సినిమా ద్వారా మరొక సారీ వార్తల్లో నిలిచారు.

ఇండియన్‌ తొలి లెస్బియన్‌ సినిమాగా రాబోతున్న ఈ సినిమా గురించి వర్మ ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే వర్మ బయోపిక్ చిత్రాలు చేయడానికి పెట్టింది పేరనే చెప్పాలి.

ఇప్పటి వరకు వర్మ ఎన్నో బయోపిక్ చిత్రాలను తెరకెక్కించారు.ఈ విధంగా ఈయన తెరకెక్కించిన కొన్ని చిత్రాలు వివాదాలకు కూడా కారణమయ్యాయి.

అయినా వాటి గురించి పట్టించుకోకుండా తనదైన శైలిలో బయోపిక్ చిత్రాలను చేస్తున్నారు.ఈ క్రమంలోనే డేంజరస్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా నుంచి వర్మకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

Telugu Biopic, Ram Gopal Varma, Rgv, Sridevi, Sridevi Biopic, Tollywood-Movie

ఈ సందర్భంగా మీడియా వర్మను ప్రశ్నిస్తూ ఇప్పటివరకు ఎన్నో బయోపిక్ చిత్రాలు తీశారు.అయితే శ్రీదేవి బయోపిక్ తీయక పోవడానికి కారణం ఏమిటి? అని ఆయనను ప్రశ్నించారు.ఇక ఈ ప్రశ్నకు వర్మ సమాధానం చెబుతూ… నేను శ్రీదేవికి వీరాభిమాని, శ్రీదేవి బయోపిక్ చిత్రం చేయాలనే ఆలోచన తనకు కూడా వచ్చిందని అయితే ఇప్పటివరకు శ్రీదేవి అంత అందంగా ఉన్న హీరోయిన్ లేకపోవటం వల్ల ఈ బయోపిక్ చిత్రాన్ని చేయలేకపోతున్నానని వర్మ ఈ సందర్భంగా శ్రీదేవి బయోపిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube