రామ్ గోపాల్ వర్మ ఈ ఫోటో తీసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడట…  

Ram Gopal varma, Director, Nagnam movie, Tollywood, Cinematography, RGV Feels proud about photos - Telugu Cinematography, Director, Nagnam Movie, Ram Gopal Varma, Rgv Feels Proud About Photos, Tollywood

తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య కాలంలో తన సినిమాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అయినటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలియనివారుండరు.అలాగే కంటెంట్ లేకపోయినా సరే కేవలం ప్రమోషన్లు, పోస్టర్ల ద్వారా సినిమా పై ఆసక్తి పెంచి ఉసూరుమనిపించడం ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ కి బాగా అలవాటైనట్లు ఉంది.

 Ram Gopal Varma Feeling Proud For That Photograph

 అయితే ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచేటువంటి దర్శకుడు మరోమారు నగ్నం చిత్ర విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన “నగ్నం” చిత్ర సినిమాటోగ్రఫీ గురించి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించాడు.

రామ్ గోపాల్ వర్మ ఈ ఫోటో తీసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడట…-Latest News-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా కొంతమేర బోల్డ్ తరహాలో ఉన్నటువంటి నగ్నం చిత్ర పోస్టర్ ని విడుదల చేశాడు.అంతేగాక ఈ పోస్టర్ కి తన సినీ తన సినీ జీవితంలో సినిమాటోగ్రఫీ వహించిన బెస్ట్ ప్రేమ్ ఇదేనంటూ క్యాప్షన్ పెట్టాడు.

దీంతో ఆర్జివి అభిమానులు ఈ వ్యాఖ్యలను మరియు పోస్టర్ ని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.అలాగే మరి కొంతమంది మాత్రం అలాంటి పోస్టర్లు విడుదల చేసే సినిమాలపై ఆసక్తి రేకెత్తించి రామ్ గోపాల్ వర్మ డబ్బులు సంపాదిస్తున్నాడని తెగ కామెంట్లు చేస్తున్నారు.

అంతేగాక ఇలాంటి బోల్డ్ తరహా చిత్రాలు తీయడం వల్ల సమాజానికి పెద్దగా ఉపయోగం ఉండదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించి పలు పోస్టర్లు కూడా విడుదల చేశాడు.ఈ చిత్రం టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కుతుండడంతో కొంతమేర ఆసక్తి నెలకొంది.

 దీంతో కొందరు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా…  అని ఎదురు చూస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం ఆ చిత్రంలో ఏమీ ఉండదని కేవలం రామ్ గోపాల్ వర్మ డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇలాంటి పోస్టర్లు విడుదల చేసి హైప్ క్రియేట్ చేస్తాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Ram Gopal Varma #Cinematography #Director

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Gopal Varma Feeling Proud For That Photograph Related Telugu News,Photos/Pics,Images..