భయపడుతున్న వర్మ.. అందుకే!       2018-05-04   00:29:43  IST  Raghu V

రామ్‌ గోపాల్‌ వర్మ ఎవరికి క్షమాపణలు చెప్పడు, ఎవరిని లెక్క చేయడు, తాను అనుకున్నది చేస్తూ పోతాడు, ఎవరిపై అయినా వ్యాఖ్యలు చేయడంలో భయపడడు. అలాంటి వర్మ ప్రస్తుతం కాస్త భయపడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల ఈయన శ్రీరెడ్డితో పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయించాడు. ఆ విషయం స్వయంగా ఆయన చెప్పుకొచ్చాడు. తాను చెప్పడం వల్లే పవన్‌పై శ్రీరెడ్డి ఆ వ్యాఖ్యలు చేసిందని, అందుకు తాను క్షమాపణలు చెబుతున్నట్లుగా ట్వీట్‌ చేశాడు. మెగా ఫ్యాన్స్‌కు, మెగా ఫ్యామిలీకి దాదాపు పది సార్లు రామ్‌ గోపాల్‌ వర్మ సారీ చెప్పడం జరిగింది.

వర్మ ఎంతగా సారీ చెప్పినా కూడా ఆయన తెరకెక్కించిన ‘ఆఫీసర్‌’ చిత్రాన్ని అడ్డుకుని తీరుతాం అని, ఆయనకు గట్టి గుణపాఠం చెబుతాం అంటూ మెగా ఫ్యాన్స్‌ భీష్మించుకు కూర్చున్నారు. పవన్‌ కళ్యాణ్‌పై కుట్ర చేసినందుకు గాను ఆయన్ను తెలుగు సినిమా పరిశ్రమ నుండి బహిష్కరించాలనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ సమయంలో ఆయన ఆఫీసర్‌తో సిద్దం అవుతున్నాడు.

ఇటీవలే వర్మ ఒక టీజర్‌ను విడుదల చేశాడు. ‘ఆఫీసర్‌’ టీజర్‌లో నాగార్జున లుక్‌ మరియు వర్మ తన దర్శకత్వం, టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. వర్మకు ఇది చాలా కాలం తర్వాత కమర్షియల్‌ సక్సెస్‌ను తెచ్చి పెడుతుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాని విడుదల అవ్వడమే కష్టం అంటూ ప్రస్తుతం కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాను మెగా ఫ్యాన్స్‌ అడ్డుకోవాలని ప్రయత్నించినా కూడా మంచి పబ్లిసిటీ వచ్చేలా చేసి, సినిమాను భారీగా విడుదల చేయాలనేది వర్మ ప్లాన్‌గా తెలుస్తోంది. అందుకే ‘ఆఫీసర్‌’ నుండి రెండవ టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మే 4 సాయంత్రం సమయంలో టీజర్‌ను లాంచనంగా విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్‌తో సినిమా స్థాయి అమాంతం పెరుగుతుందని, ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుకునేలా టీజర్‌ ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

రామ్‌ గోపాల్‌ వర్మ మెగా ఫ్యాన్స్‌కు బయపడి ‘ఆఫీసర్‌’ ప్రమోషన్‌ అనుకున్నదాని కంటే ఎక్కువ చేస్తున్నాడని, సినిమా విడుదలకు ఇంకా చాలా టైం ఉన్నా కూడా అప్పుడే వర్మ జాగ్రత్త పడుతున్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఆఫీసర్‌’ చిత్రంలో నాగార్జునకు జోడీగా మైరా సరీన్‌ నటించింది.

ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో వర్మ నిర్మించడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం విడుదలైయ్యేంత వరకు అనుమానమే అంటూ కొందరు సినీ వర్గాల వారు అంటున్నారు. అయితే వర్మ మాత్రం అంత సులభంగా ఈ చిత్రంను వదలడని, ఒక వేళ విడుదలకు అడ్డు పడితే ఎక్కడికైనా వర్మ వెళ్లే అవకాశం ఉంది.