ఆర్జీవి : అది నన్ను చంపకుండా వదిలి పెడుతుందనే అనుకుంటున్నా...  

Ram Gopal Varma Dogs Tweet Goes Viral In Social Media - Telugu Ram Gopal Varma,, Ram Gopal Varma Latest Movie News, Ram Gopal Varma Movie News, Ram Gopal Varma Tweet Viral

టాలీవుడ్ లో విభిన్న కథనాలను ఎంచుకుంటూ అలాగే సరికొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులని తనదైన శైలిలో అలరించే టువంటి ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి పెద్దగా తెలియని వారుండరు.అయితే ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో మునిగి తేలుతూ నిత్యం వార్తల్లో నిలిచేటువంటి రామ్ గోపాల్ వర్మ ఈమధ్య సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్నాడు.

 Ram Gopal Varma Dogs Tweet Goes Viral In Social Media

అయితే తాజాగా రాంగోపాల్ వర్మ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంది.

తాజాగా రామ్ గోపాల్ వర్మ ఇటీవలే తన రక్షణ నిమిత్తమై రెండు కుక్కలని కొన్నానని, ఇందులో లో రాటీవైలర్ అంటే తనకు ఎంతో ఇష్టమని అని పేర్కొన్నాడు.

ఆర్జీవి : అది నన్ను చంపకుండా వదిలి పెడుతుందనే అనుకుంటున్నా…-Latest News-Telugu Tollywood Photo Image

అంతే కాక ఇప్పుడు ప్రస్తుతం తన స్నేహితుడి ఇంట్లో ఉన్నాననీ, అంతేకాక తాను వెళ్ళిపోయే ముందు రాటీవైలార్ చంపదనే అనుకుంటున్నానని అంటూ పోస్ట్ చేశాడు.అయితే మళ్ళీ వీటిని PKF, CBNF, LBF, తదితరుల నుంచి రక్షణ నిమిత్తమై మాత్రమే కొన్నానని కూడా మరో ట్వీట్ చేశాడు.

దీంతో ప్రస్తుతం ట్వీట్లు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.అయితే రామ్ గోపాల్ వర్మ షార్ట్ కట్ లో చెప్పినటువంటి ఈ పేర్లు ఏంటా అని ప్రస్తుతం నెటిజన్లు ఆలోచనలో పడ్డారు.

ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించినటువంటి కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయాన్ని చవి చూస్తున్నాయి.దీంతో రామ్ గోపాల్ వర్మ కొంతమేర కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఓ భారీ బడ్జెట్ చిత్రం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోని ఈ విషయమై సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం.

అన్నీ కుదిరితే ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టు జూన్ నెలలో పట్టాలెక్కిన ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Gopal Varma Dogs Tweet Goes Viral In Social Media,ram Gopal Varma Latest Movie News,ram Gopal Varma Movie News,ram Gopal Varma Tweet Viral- Related Telugu News,Photos/Pics,Images..