కరోనా పాజిటివ్ వార్తపై వర్మ ఏమన్నాడంటే?  

RGV Denies Rumours Of Corona, RGV, Ram Gopal Varma, Corona Virus, Naked Movie - Telugu Corona Virus, Naked Movie, Ram Gopal Varma, Rgv

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల వరుసగా సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.ఇప్పటికే శృంగార తార మియా మాల్కోవాతో క్లైమాక్స్ అనే సినిమాను తెరకెక్కించి ఓటీటీలో రిలీజ్ చేశాడు.

 Ram Gopal Varma Corona Virus

కాగా తాజాగా ‘నగ్నం’ అనే సినిమాను తెరకెక్కించి మరోసారి ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకున్నాడు.ఇక ఈ సినిమాను అందుకున్న సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి అనౌన్స్ చేస్తూ వస్తున్న వర్మ, వాటిని తన యూనిట్‌తో కలిసి తెరకెక్కించే పనిలో పడ్డాడు.

అయితే వర్మకు చెందిన టీమ్‌లోని ఓ సభ్యుడికి కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దీంతో వర్మ తన షూటింగ్‌లను రద్దు చేశాడనే వార్త కూడా ప్రచారంలో ఉంది.

కరోనా పాజిటివ్ వార్తపై వర్మ ఏమన్నాడంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ వార్తలపై తాజాగా వర్మ స్పందించాడు.తన చిత్ర యూనిట్ సభ్యుడికి కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్త పూర్తిగా అవాస్తవం అని, షూటింగ్‌లో పాల్గొనే ప్రతి సభ్యుడికి పరీక్షలు నిర్వహించిన తరువాతే అనుమతిస్తామని, అందులో వారికి నెగెటివ్ అని రావడంతోనే తాము షూటింగ్ నిర్వహిస్తామని వర్మ తెలిపాడు.

మొత్తానికి వర్మ టీమ్ సభ్యుడికి కరోనా అనే వార్తలో ఎలాంటి నిజం లేదనే విషయాన్ని వర్మ స్వయంగా తెలపడంతో ఈ వార్తలకు చెక్ పడింది.ఇక ప్రస్తుతం ‘పవర్‌స్టార్’ అనే సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్న వర్మ, ఇటీవల 12 ఓ క్లాక్ అనే హార్రర్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా అది యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

మొత్తానికి లాక్‌డౌన్ సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్న వర్మ, ఇలా వరుసబెట్టి సినిమాలను లైన్‌లో పెట్టాడు.

#RGV #Ram Gopal Varma #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Gopal Varma Corona Virus Related Telugu News,Photos/Pics,Images..