పరువుహత్య అంటే ఇదీ అంటూ తనదైన స్టైల్లో నిర్వచనం ఇచ్చిన వర్మ...     2018-09-22   11:55:12  IST  Rajakumari K

నిత్యం సోషల్ మీడియాలో హడావిడి చేసే రాంగోపాల్ వర్మ గతకొద్ది రోజులుగా సైలెంట్ అయ్యాడు.. ఇది అది అంటూ తేడా లేకుండా ప్రతి దానిపై స్పందించే వర్మ కామ్ గా ఉండడంతో అభిమానులే కాదు నెటిజన్లు కూడా ఏమైంది వర్మకు అనుకునే పరిస్థితి వచ్చింది..ఇటీవల జరిగిన పరువుహత్యపై వర్మ ఎందుకు రెస్పాండ్ కావట్లే..వర్మే ఉండుంటే మారుతిరావు క్యారెక్టర్ గా ఒక క్రైమ్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తాడు అనే కామెంట్స్ వినిపించాయి..ఇదే టైంలో వర్మ ట్విటర్లో పోస్టు పెట్టాడు..తనదైన స్టైల్లో స్పందించాడు… అసలు పరువు హత్య అంటే ఏమిటో కూడా నిర్వచనం ఇచ్చాడు.

‘పరువు కోసం ప్రణయ్‌ని చంపానని చెప్పుకుంటున్న మారుతీరావు ఏం సాధించాడని ప్రశ్నించాడు. ‘పరువు కాపాడుకోవడానికేప్రణయ్‌ ప్రాణాలు తీయించానని చెప్పిన హంతకుడు తన పరువును తానే రోడ్డుకీడ్చుకున్నాడు. పరువు పోయింది గనుక మారుతీరావు చచ్చేందుకు సిద్ధంగా ఉండాలి..

Ram Gopal Varma Comments On Amrutha Fathers-AmruthaPranay Murder,Ram Gopal Varma,Ram Gopal Varma Comments On Amrutha Fathers,RGV Tweet

నిజమైన పరువు హత్య అంటే.. పరువు కోసం హత్యచేసేవారిని చంపేయడమే’ అని ట్వీట్ చేశారు. ప్రణయ్‌ని చంపించిన మారుతిరావు పిరికిపంద, హంతకుడు అని తిట్టిపోశాడు. కాగా, ప్రణయ్ హత్యపై సినిమా తీయాలని అభిమానులు వర్మను కోరుతున్నారు. కొందరు వర్మ టీటును తిడుతున్నారు. వర్మ ఇలాంటి వాటిపైనే స్పందిస్తాడని, దేశ భద్రత, రాజకీయ నేతల అవినీతిపై స్పందించడని అంటున్నారు..