రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీం పాత్ర లకు సంబంధించిన సన్నివేశాలను చూపించబోతున్నాం అంటూ ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.ఇప్పుడు ఈ సినిమా లో అల్లూరి సీతారామ రాజు ను తప్పు గా చూపించి.
తమ మనోభావాలను దెబ్బ తీస్తున్నారు అంటూ ఆయన కుటుంబ సభ్యులు మీడియా ముందుకు రావడం చర్చనీయాంశం గా మారింది.రాజమౌళి గారు అంటే మాకు గౌరవం అంటూనే తమ కుటుంబానికి చెందిన అల్లూరి సీతారామ రాజు చరిత్రను తప్పుగా చూపించి జనాల్లో మా కుటుంబం యొక్క గౌరవం మరియు పరువు తీసే విధంగా రాజమౌళి వ్యవహరిస్తున్నారు అంటూ అల్లూరి సీతారామ రాజు మనవడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వింత కామెంట్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.తనకు ఇన్ని రోజులు అల్లూరి సీతారామ రాజు అంటే చాలా గౌరవం ఉండేది.
కానీ ఇప్పుడు ఇతడు నిజంగా ఆయన మనవడు అని చెప్తే మాత్రం అల్లూరి పై నాకు ఉన్న గౌరవం పోతుంది.ఇలాంటి ఒక మనవడు ఉన్నందుకు ఆయన పై కోపం కూడా వస్తుంది అంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
ఇప్పటికే రాజమౌళి పై సీరియస్ గా ఉన్న అల్లూరి ఫ్యామిలీ సభ్యులు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల తో మరింత రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి.
రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన వివాదం ప్రస్తుతం యూనిట్ సభ్యులకు ఆందోళన కలిగిస్తోంది.మరో వైపు ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ సినిమా పై వ్యతిరేకంగా మాట్లాడటానికి ఆసక్తి లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.