నానాకు వర్మ మద్దతు.. సోషల్‌ మీడియాలో జోకులు  

బాలీవుడ్‌ హీరోయిన్‌ తనూశ్రీ దత్తా పదేళ్ల క్రితం తనపై జరిగిన లైంగిక దాడిని ఇప్పుడు మీడియా ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. అప్పట్లో ఈమె నటించిన ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ చిత్రం షూటింగ్‌ సమయంలో అంతా చూస్తూ ఉండగానే నానా పటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ సమయంలో నాకు చాలా ఇబ్బంది అయ్యిందని చెప్పుకొచ్చింది. మీటూ ఉద్యమానికి నాంది పలికిన తనూశ్రీ దత్తాకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. పలువురు హీరోయిన్స్‌ మీటూ అంటూ తనూశ్రీకి మద్దతు తెలుపుతున్న ఈ సమయంలో నానా పటేకర్‌కు కూడా కొందరు తమ మద్దతు పలుకుతున్నారు.

Ram Gopal Varma Comes In Support Of Nana Patekar-

Ram Gopal Varma Comes In Support Of Nana Patekar

కొందరు సినీ ప్రముఖులు నానా పటేకర్‌కు మద్దతు తెలిపి, నానాపై తమకు నమ్మకం ఉందన్నారు. తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మ కూడా నానా పటేకర్‌ కు మద్దతు తెలిపాడు. తాను ముంబయి వచ్చిన మొదట్లో కలిసిన వ్యక్తి నానా పటేకర్‌. నేనో దర్శకుడిని, మిమ్ములను కలవాలి సర్‌ అంటూ ఫోన్‌ చేసిన సమయంలో వెంటనే ఇంటికి వచ్చేయ్‌ అన్నాడు. నా బాలీవుడ్‌ కెరీర్‌లో కీలక పాత్రను పోషించిన వ్యక్తి నానా పటేకర్‌ అంటూ చెప్పుకోగలను అంటూ వర్మ పేర్కొన్నాడు.

Ram Gopal Varma Comes In Support Of Nana Patekar-

నానాకు కాస్త కోపం ఎక్కువ, షార్ట్‌ టెంపర్‌ అని ఒప్పుకుంటాను, కాని ఆయన లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు అంటే నమ్మలేక పోతున్నాను. నానా పటేకర్‌ అలాంటి వ్యక్తి కాదని తన అభిప్రాయం అని, ఆయన గురించి ఇన్నాళ్లుగా చూస్తున్నాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. తనూశ్రీ దత్తా పొరపాటు పడుతుందేమో అని, ఒకసారి చెక్‌ చేసుకోవాలంటూ వర్మ కోరాడు. అయితే ఇప్పటికే ఆలస్యం అయ్యింది. నానా పటేకర్‌కు ఫుల్‌గా డ్యామేజీ జరిగిపోయింది. ఇప్పుడు వర్మ వచ్చి నానాకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో పిల్లికి ఎలుక సాక్ష్యమా అంటూ జోకులు పేళుతున్నాయి.