12 ఓ క్లాక్ టీజర్ టాక్: నిజంగానే భయపెట్టిన వర్మ  

Ram Gopal Varma 12 O Clock Teaser Released, Ram Gopal Varma, Climax, Nagnam, 12 O Clock, MM Keeravani - Telugu 12 O Clock, Climax, Mm Keeravani, Nagnam, Ram Gopal Varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్‌ను పూర్తిగా వినియోగించుకుంటున్నాడు.ఈ సమయంలో వరుబెట్టి సినిమాలు రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

 Ram Gopal Varma Climax Nagnam

ఇప్పటికే మియా మాల్కోవాతో క్లైమాక్స్ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ డైరెక్టర్, రీసెంట్‌గా నగ్నం అనే సినిమాను తెరకెక్కించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు.కాగా పవన్ కళ్యాణ్‌పై పవర్ స్టార్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నానంటూ ప్రకటించిన వర్మ, ఎవ్వరి ఊహలకు అందకుండా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు.

అయితే ఈ సారి వర్మ హార్రర్ సినిమాతో మనముందుకు రానున్నాడు.‘12 O Clock’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాను హార్రర్ కథాంశంతో రూపొందించి ప్రేక్షకులను మరోసారి భయపెట్టేందుకు రెడీ అయ్యాడు.గతంలో దెయ్యం, రాత్రి వంటి సినిమాలతో ప్రేక్షకులను జడుసుకునేలా చేసిన వర్మ, ఇప్పుడు మరోసారి అలాంటి కథతో మనముందుకు వస్తున్నాడు.ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండటం నిజంగా విశేషమని చెప్పాలి.

12 ఓ క్లాక్ టీజర్ టాక్: నిజంగానే భయపెట్టిన వర్మ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశాడు వర్మ.ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేసేందుకు వర్మ ప్లాన్ చేస్తున్నాడు.

అయితే థియేటర్లు లేకపోవడం వర్మకు నిజంగా కలిసొచ్చిందని చెప్పాలి.అందరూ ఓటీటీలకు అలవాటు పడంతో వర్మ సినిమాలకు మంచి గిరాకీ వచ్చి పడింది.

మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమా టీజర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

#MM Keeravani #Climax #12 O Clock #Ram Gopal Varma #Nagnam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Gopal Varma Climax Nagnam Related Telugu News,Photos/Pics,Images..