అన్నీ తెలిసిన జనాలకు మీరు చెప్పేంది ఏంటీ బోడీ అంటున్న వర్మ  

Ram Gopal Varma Blames Cencor Board-kamma Rajyamlo Kadapa Reddlu,ram Gopal Varma,కమ్మరాజ్యంలో కడప రెడ్లు,రామ్‌ గోపాల్‌ వర్మ

రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరిని ఆలోచింపజేస్తూ ఉంటాడు.సొసైటీలో ఉన్న కొన్ని పద్దతులపై ఆయన ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నాడు.తాజాగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెన్సార్‌ వ్యవస్థపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు.సెన్సార్‌ బోర్డు అనేది ఒక వృదా వ్యవస్థ అని దాని వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.

Ram Gopal Varma Blames Cencor Board-kamma Rajyamlo Kadapa Reddlu,ram Gopal Varma,కమ్మరాజ్యంలో కడప రెడ్లు,రామ్‌ గోపాల్‌ వర్మ Telugu Tollywood Movie Cinema Film Latest News-Ram Gopal Varma Blames Cencor Board-Kamma Rajyamlo Kadapa Reddlu Ram కమ్మరాజ్యంలో కడప రెడ్లు రామ్‌ గోపాల్‌ వర్మ

ఇటీవల ఆయన తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా సెన్సార్‌ కావడం లేదు.

సెన్సార్‌ కాకపోవడం వల్ల మొన్న విడుదల అవ్వాల్సిన సినిమా ఇంకా విడుదల కాలేదు.కమ్మరాజ్యంలో కడప రెడ్లు విడుదల కాకపోవడంతో దర్శకుడు వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.ప్రస్తుతం సినిమాకు సెన్సార్‌ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనాలకు ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని తమ పరిపాలకులుగా ఎంచుకోవాలనే విషయం తెలిసి ఉన్నప్పుడు వారికి ఎలాంటి సినిమా చూడాలో తెలియదా అంటూ వర్మ ప్రశ్నిస్తున్నాడు.

సెన్సార్‌ అనేది కాలం చెల్లిన పద్దతి.ఇకపై సెన్సార్‌ అనేది సినిమాలకు ఉండవద్దంటూ ఆయన సూచిస్తున్నాడు.ఇండియాలో ఈ సినిమా సెన్సార్‌ వ్యవస్థ రద్దుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.

నిజంగానే వర్మ చెప్పినట్లుగా అసలు సెన్సార్‌ వ్యవస్థ అవసరం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.మాకు తెలియదా ఎలాంటి సినిమాలు చూడాలో అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.