అనురాగ్ కి వర్మ మిస్టర్ పర్ఫెక్ట్ సర్టిఫికెట్

నటి పాయల్ ఘోష్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.తనని అనురాగ్ రేప్ చేసే ప్రయత్నం చేశారని ఓ మీడియా ఇంటర్వ్యూలో పేర్కొంది.

 Ram Gopal Varma Backs Anurag Kashyap, Bollywood, Meetoo, Taapsee Pannu, Ram Gopa-TeluguStop.com

అయితే ఆమె చేసిన ఆరోపణలు సంచలనంగా మారడంతో పాటుచాలా మంది నెటిజన్లు, రాజకీయ నాయకులు అనురాగ్ కశ్యప్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే అయితే పాయల్ ఘోష్ ఆరోపణలు వాస్తవం కాదని అనురాగ్ కశ్యప్ ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని లైంగికంగా వేదించే ప్రయత్నం చేయలేదని కొంత హీరోయిన్స్ అతనికి అండగా నిలబడ్డారు.

బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్ పెద్ద ఫెమినిస్ట్ అని తాప్సి కామెంట్ చేసింది.మహిళల గురించి ఎక్కువగా ఆలోచించి, సమాజంలో వారు ఎదురుకొంటున్న సమస్యలపై సినిమాలు తీసే వ్యక్తిత్వం అతనిది అంటూ ట్వీట్ చేసింది.

అతనిపై వచ్చిన ఆరోపణలలో నిజం లేదని నేను నమ్ముతున్నాను అంటూ పోస్ట్ చేసింది.

తాప్సితో పాటు అనురాగ్ కి సన్నిహితంగా ఉండేవారు కూడా ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాదని అంటున్నారు.

ఇదిలా ఉంటే అనురాగ్ కశ్యప్ సినీ గురువు ఆర్జీవీ కూడా అతనిపై వచ్చిన ఆరోపణపై స్పందించారు.అనురాగ్ కశ్యప్ ను నేను 20 ఏళ్లుగా చూస్తున్నాను.ఆయన చాలా సున్నిత మనస్కుడు.ఎవరిని కూడా బాధపెట్టే వ్యక్తిత్వం ఆయనది కాదు.

ఆయన ఎప్పుడు ఎవరిని బాధ పెట్టిన సందర్బాలు లేవు.కనుక ప్రస్తుతం ఆయన గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదేమో అని తాను నమ్ముతున్నట్లుగా ట్వీట్ చేశాడు.

ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత అనురాగ్ కశ్యప్ కూడా మానసికంగా కొంత ఆందోళనకి గురవుతున్నట్లు బి-టౌన్ లో టాక్ వినిపిస్తుంది.తన వ్యక్తిత్వాన్ని తగ్గించే విధంగా వచ్చిన ఈ ఆరోపణల వెనుక ఎవరో ఉన్నారని అంటున్నారు.

మరి ఈ వ్యవహారం బాలీవుడ్ లో ఎంత వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube