మంచి దారిలో వర్మ

‘శివ’ వంటి ఎన్నో అద్బుత చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన రామ్‌ గోపాల్‌ వర్మ బాలీవుడ్‌లో కూడా పలు ఆణిముత్యాల వంటి సినిమాలు తెరకెక్కించాడు.బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సైతం వర్మ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపించే వారు.

 Ram Gopal Varma Attack With Manchu Manoj-TeluguStop.com

కాని పబ్లిసిటీ కోసం పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ కొందరు శత్రువులను ఏర్పర్చుకున్నాడు.ఈ దర్శకుడు గత కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో కెరీర్‌ను నెట్టుకు వస్తున్నాడు.

గత సంవత్సరం తెలుగులో వరుసగా సినిమాలు తెరకెక్కించిన వర్మ ఒక్క మంచి సక్సెస్‌ను కూడా దక్కించుకోలేక పోయాడు.

వర్మ తెరకెక్కించిన వరుస సినిమాలు ఫెయిల్‌ అవ్వడంతో ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది.

తన పాత స్టైల్‌లో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.ప్రయోగాలకు పోకుండా కమర్షియల్‌ హంగులతో సినిమా చేసి మళ్లీ తన సత్తా చాటాలని భావిస్తున్నాడు.

అందుకోసం ఈయన మంచు మనోజ్‌ను హీరోగా ఎంచుకున్నాడు.ఈ మంచు హీరోతో ‘ఎటాక్‌’ చేయిస్తున్నాడు వర్మ.

జగపతిబాబు, వడ్డె నవీన్‌లు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి.మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఈ సినిమాతో వర్మ మంచి దారిలో పడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube