కొత్త మెగా హీరోను ప్రకటించిన రామ్ గోపాల్‌ వర్మ

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కొన్ని సార్లు చేసే ట్వీట్స్ మరియు వ్యాఖ్యలు ఆలోపించజేసే విధంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు.ఇటీవల పుష్ప సినిమా గురించి ఆయన చేసిన ట్వీట్ అందరిని ఆశ్చర్యపర్చింది.

 Ram Gopal Varma About Allu Arjun Stardom , Ram Gopal Varma, Allu Arjun , Tollywood , Ram Charan , Chiranjeevi, Pushpa-TeluguStop.com

రామ్‌ గోపాల్ వర్మ పుష్ప సినిమా పై ప్రశంసలు కురిపించడంతో పాటు బాలీవుడ్‌ సినిమాల కంటే పుష్ప గ్రేట్.బాలీవుడ్ హీరోల కంటే అల్లు అర్జున్ గ్రేట్ అన్నట్లుగా ఆయన ట్వీట్‌ చేశాడు.

దాంతో ఆ సమయంలో ఆయన ట్వీట్‌ ను అల్లు అర్జున్‌ అభిమానులు తెగ షేర్‌ చేశారు.అయితే ఇప్పుడు ఆయన షేర్‌ చేసిన విషయం ఒకటి చర్చనీయాంశంగా మారింది.

 Ram Gopal Varma About Allu Arjun Stardom , Ram Gopal Varma, Allu Arjun , Tollywood , Ram Charan , Chiranjeevi, Pushpa-కొత్త మెగా హీరోను ప్రకటించిన రామ్ గోపాల్‌ వర్మ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పుష్ప సినిమా తో టాలీవుడ్‌ లో ఆయనే స్టార్‌ గా నిలిచాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఇదే సమయంలో ఆయన టాలీవుడ్‌ లో మెగా ట్యాగ్‌ కు సరైన అర్హుడు ఇప్పుడు అల్లు అర్జున్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ మరియు సుకుమార్‌ ల కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఏకంగా 350 కోట్ల వసూళ్లు దక్కించుకుంది.కనుక ఈ సినిమా తో బన్నీకి మెగా ట్యాగ్‌ ఇచ్చేయవచ్చు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మెగా అనేది చిరంజీవికి ఆ తర్వాత ఆయన వారసుడు రామ్‌ చరణ్‌ కు వస్తుందని అంతా భావించారు.

Telugu Allu Arjun, Chiranjeevi, Pushpa, Ram Charan, Ram Gopal Varma, Tollywood-Movie

కాని ఇప్పుడు ఆ ట్యాగ్‌ ను రామ్ చరణ్‌ కు ఇస్తే బెటర్ అనే ఉద్దేశ్యం ను మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.కాని రామ్‌ గోపాల్‌ వర్మ మాత్రం అల్లు అర్జున్ కు మెగా ట్యాగ్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చేసిన ట్వీట్‌ హాట్ టాపిక్ అయ్యింది.ఆయన వ్యాఖ్య లను అల్లు అర్జున్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ బన్నీకి మాత్రమే మెగా బ్రాండ్ సెట్‌ అవుతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube