వర్మ దీన్ని అయినా కొన్నాళ్లు నడుపుతాడా మద్యలోనే మూసేస్తాడా?

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్‌ సెట్టర్ అనడంలో సందేహం లేదు.రామ్‌ గోపాల్‌ వర్మ శివ సినిమా మొదలుకుని ఎన్నో ప్రయోగాలను చేశాడు.

 Ram Gopal Varam New Film D Company Release Spark Ott-TeluguStop.com

ఆ సినిమా షూటింగ్‌ మొదలు అయిన సమయంలో వర్మ కు సినిమా లు తీయవచ్చా అంటూ కొందరు పెదవి విరిచారు.కాని ఆ ఆ సినిమా తర్వాత మొత్తం ఇండస్ట్రీ అంతా ఆయన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు.

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అంటూ పేరు దక్కించుకుని ఎన్నో వివాదాలకు తెర తీశాడు.సినిమా లతో ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేసిన దర్శకుడు వర్మ ఈ మద్య కాలంలో వివాదాలు ఎక్కువ కంటెంట్ తక్కువ అన్నట్లుగా సినిమా లు చేస్తున్నాడు.

 Ram Gopal Varam New Film D Company Release Spark Ott-వర్మ దీన్ని అయినా కొన్నాళ్లు నడుపుతాడా మద్యలోనే మూసేస్తాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన ఎన్నో కొత్త వాటిని మొదలు పెడతాడు కాని చివరి వరకు దాన్ని కొనసాగించడం లేదు.తాజాగా వర్మ స్పార్క్‌ అనే ఓటీటీ ని ఆరంభించాడు.

తన డి కంపెనీ సినిమా ను స్పార్క్ ద్వారా విడుదల చేయబోతున్నాడు.

ఈనెల 15న ప్రారంభం కాబోతున్న స్పార్క్‌ ఓటీటీ కి సంబంధించి ప్రభాస్‌ వీడియోతో ప్రకటన చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి స్పార్క్‌ పై పడింది.

ఈ ఓటీటీ తో వర్మ తన సినిమాలతో పాటు బయటి వారి సినిమాలను కూడా స్ట్రీమింగ్‌ చేస్తాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.వర్మ ఏడాదికి పది పదిహేను సినిమాలను తీయగల సమర్ధుడు.

కనుక వర్మ ఒక్కడే స్పార్క్‌ ఓటీటీకి కంటెంట్ ఇవ్వగలడు.ఆయన మాత్రమే కాకుండా ఆయన శిష్యులు కూడా చాలా మంది ఉన్నారు.

వారు కూడా స్పార్క్‌ కోసం కంటెంట్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.కనుక స్పార్క్‌ ను సరిగ్గా రన్‌ చేస్తే తప్పకుండా తెలుగు ఆహా ను బీట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కొందరు అంచనా వేస్తున్నారు.

కాని వర్మ దీన్ని అయినా తుది వరకు నడుపుతాడా అంటే అనుమానమే అంటూ స్వయంగా ఆయన సన్నిహితులు అంటున్నారు. ఆమద్య శ్రేయాస్‌ ఈటీలో వరుసగా సినిమాలు విడుదల చేసి మద్యలో వదిలేసిన వర్మ ఇప్పుడు స్పార్క్‌ ను ఎప్పుడు వదిలేస్తాడో చూడాలి.

#Ram Gopal Varma #Varma Film #Spark Ott

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు