నాన్న నటవారసత్వాన్ని మాత్రమే కాదు అన్నీ కొనసాగిస్తా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అతి తక్కువ సమయంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

 Ram Charans Shocking Comments About His Father Ram Charan, Tollywood, Hero, Chir-TeluguStop.com

మెగా ఫ్యామిలీ నుండి మెగా వారసుడుగా అడుగు పెట్టి తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే తాజాగా తన తండ్రి గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

2007లో చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు చరణ్.తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అభిమానులను సంపాదించుకున్నాడు.ఆ తర్వాత మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించుకున్నాడు.ఈ సినిమాతోనే స్టార్ హోదాను సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత వరుసగా పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.

అందులో కొన్ని ఫ్లాప్, హిట్ లను కూడా అందుకున్నాడు.

Telugu Chiranjeevi, Hiranjeevi Bank, Ram Charan, Tollywood-Movie

ఇక రామ్ చరణ్ ఒక నటుడుగానే కాకుండా బిజినెస్ మాన్ గా కూడా బాధ్యతలు చేపట్టాడు.తనకంటూ సొంతంగా బిజినెస్ రంగంలో అడుగులు పెట్టి బాగా బిజీ గా మారాడు.ఇక ఈయన 2012లో ఉపాసన ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత కూడా రామ్ చరణ్ తన భార్య సపోర్టుతో సినిమాలలో కొనసాగాడు.ఇక ఈయన కేవలం తన విషయంలోనే కాకుండా తన తండ్రి చిరంజీవి విషయంలో కూడా బాగా బాధ్యతలు చేపట్టాడు.

Telugu Chiranjeevi, Hiranjeevi Bank, Ram Charan, Tollywood-Movie

తాజాగా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనే వెబ్ సైట్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ వెబ్ సైట్ లాంచ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.ఈ సందర్భంగా రామ్ చరణ్ తన తండ్రి గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.తన నాన్న నట వారసత్వాన్నే కాదు సేవ తత్వాన్ని కూడా తీసుకుంటాను అంటూ.

చిన్నచిన్న అడుగులతో తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపాడు.

Telugu Chiranjeevi, Hiranjeevi Bank, Ram Charan, Tollywood-Movie

మరో 30 ఏళ్లపాటు తన ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు సేవలు కొనసాగుతాయని అంతేకాకుండా రెండవ దశలో కూడా బ్లడ్ బ్యాంకు కోసం కూడా ప్రత్యేక యాప్ లను రూపొందించాలన్న ఆలోచన ఉందని తెలిపాడు.ఇక తమ సినిమా పారితోషకాలతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కొనసాగుతుందని తెలిపాడు.ఇక పది మందికి ఈ సంస్థ నుండి సహాయం అందుతుందంటే దాతల నుంచి కూడా విరాళాలు తీసుకుంటామని తెలిపాడు.

ఇక ఈ వెబ్సైట్ ద్వారా గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదని ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని సమయానికి వచ్చి పని చేసుకోవచ్చని తెలిపాడు.చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్లలో 25 భాషలలో అందుబాటులో ఉంటుందని తెలిపాడు.

ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని రక్తం దానం చేయొచ్చని ఏం కావాలన్నా ఒక్క క్లిక్ తోనే అందుబాటులోకి వస్తుందని తెలిపాడు చరణ్.ప్రస్తుతం చరణ్ మాట్లాడిన మాటలు యూట్యూబ్ లో వైరల్ గా మారాయి.

చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube