వార్ని.. చరణ్‌ చాలా స్పీడున్నాడు

‘బ్రూస్‌లీ’ చిత్రం ఫెయిల్‌ అవ్వడంతో తన తర్వాత సినిమాకు చరణ్‌ చాలా గ్యాప్‌ తీసుకున్నాడు.ఈ గ్యాప్‌లో ఈయన తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘తని ఒరువన్‌’ రీమేక్‌కు ఓకే చెప్పాడు.

 Ram Charan’s Movie First Schedule Completed-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్‌ చడీ చప్పుడు కాకుండా మొదలు కూడా అయ్యింది.హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసి సినీ వర్గాలకు చరణ్‌ అండ్‌ టీం షాక్‌ ఇచ్చారు.

దాదాపు పది రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అల్లు అరవింద్‌ ఈ రీమేక్‌ను నిర్మిస్తున్నాడు.

‘కిక్‌ 2’తో డిజాస్టర్‌ను సొంతం చేసుకున్న సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.తమిళంలో సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.

తమిళంలో నటించిన అరవింద్‌ సామీ ఈ చిత్రంలో కూడా విలన్‌ పాత్రలో కనిపించబోతున్నాడు.భారీ అంచనాలున్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

అందుకే ఈ సినిమా షెడ్యూల్స్‌ను పూర్తి చేసేందుకు దర్శకుడు చాలా స్పీడుమీదున్నాడు.జూన్‌ చివరి వరకే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనే పట్టుదలతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేశారు.వీరిద్దరు ఇప్పటికే ‘బ్రూస్‌లీ’ చిత్రంలో కలిసి నటించిన విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube