వైరల్ అవుతున్న చిరు ఫ్యామిలీ గ్రూప్ ఫోటో!

సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, కేవలం సొంత కష్టంతో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వెండితెరకు చిరంజీవి పరిచయమయ్యారు.తన నటన ద్వారా అందరినీ మెప్పించిన చిరంజీవి తెలుగులో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.

 Megastar Chiranjeevi Family Photo Viral In Social Media, Ram Charan, Megastar Ch-TeluguStop.com

తాను నటించిన సినిమాలు విజయవంతం కావడంతో చిరంజీవికి వరుసగా అవకాశాలు వచ్చాయి.దాదాపు 150 పైగా చిత్రాలలో నటించిన చిరంజీవి ఎన్నో అవార్డులను సైతం దక్కించుకున్నారు.

కొద్దిరోజుల పాటు సినీ ఇండస్ట్రీలో విరామం తీసుకుని రాజకీయాల వైపు దృష్టి సారించిన మెగాస్టార్ తిరిగి ఖైదీ నెంబర్ 150 ద్వారా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.తర్వాత సైరా నరసింహారెడ్డి వంటి విభిన్నమైన పాత్రలో నటించిన చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
తన అద్భుతమైన నటనను ప్రదర్శించడం ద్వారా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.మెగాస్టార్ వారసుడిగా రామ్ చరణ్ తేజ్ సినీ ఇండస్ట్రీలోకి చిరుత సినిమా ద్వారా ఆరంగ్రేటం చేశారు.

మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించిన రామ్ చరణ్ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు.చిరంజీవి ప్రముఖ నిర్మాత అల్లు రామలింగయ్య గారి కూతురు సురేఖను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే చిరంజీవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు.

Telugu Chiranjeevi, Memorable, Ram Charan-Movie

మెగాస్టార్ పిల్లలు రామ్ చరణ్, సుస్మిత, శ్రీజ వీరి ముగ్గురికి వివాహాలు జరిగి వారి వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.

ఆర్.ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.అయితే మెగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి తాజాగా ఒక ఫోటో దిగారు.ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అభిమానులను ఆకట్టుకుంటుంది.ఇలా మెగా ఫ్యామిలీ ని ఒక చోట చూసిన నెటిజన్లు తెగ సంబర పడిపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube