నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న రామ్ చరణ్ లేడీ ఫ్యాన్స్... వైరల్ అవుతున్న వీడియో!

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.ముఖ్యంగా హీరోలకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.

 Ram Charans Lady Fans Grabbed Her Hair On The Road The Video Is Going Viral, Ram-TeluguStop.com

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారిపోయి ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు.ఇక రామ్ చరణ్ కు కూడా విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే.

ఎంతగా అంటే హీరో కోసం ఏకంగా నడిరోడ్డుపై ఒకరినొకరు పట్టుకొని కొట్టుకునే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

ప్రస్తుతం రామ్ చరణ్ అభిమానులు కాలేజీ విద్యార్థులు నడిరోడ్డుపై ఒకరినొకరు జుట్టు పట్టుకొని కొట్టుకోవడమే కాకుండా పిడుగుద్దులు గుద్దుకుంటూ గొడవకు దిగారు.ఇలా ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్(Collage Students) మధ్య రామ్ చరణ్ విషయం గురించి ఘర్షణ మొదలైంది.దీంతో వీరిద్దరూ నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఒకరినొకరు తన్నుకున్నారు.

ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది విద్యార్థులు ఈ ఘటనను సెల్ ఫోన్లో బంధించారు.ఇలా వీరిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నప్పటికీ పక్కన ఉన్నటువంటి వారు ఈలలు వేస్తూ చూస్తున్నారు.

ఇలా వీరి మధ్య ఘర్షణ పెద్దదిగా మారుతూ ఉండడంతో అక్కడే ఉన్నటువంటి కొందరు అబ్బాయిలు వచ్చి వీరిని ఆపారు.అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయం తెలియదు కానీ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రామ్ చరణ్ లేడీ ఫ్యాన్స్ వార్(Ramcharan Lady Fans War) అనే క్యాప్షన్ జోడించి ఈ వీడియోని షేర్ చేసారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube