'సైరా' కోసం కొత్త అవతారం ఎత్తబోతున్న రామ్‌ చరణ్‌  

Ram Charan Working For Saira Narasimha Reddy Promotions-

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు సిద్దం అవుతోంది.ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంను గాంధీ జయంతి సందర్బంగా విడుదల చేయబోతున్నారు.రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రంను కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు.సినిమా విడుదలకు ముందు నెల రోజుల పాటు భారీగా ప్రమోషన్స్‌ చేయడం వల్ల భారీ ఓపెనింగ్స్‌ను దక్కించుకునేందుకకు ప్రయత్నాలు చేస్తున్నారు..

Ram Charan Working For Saira Narasimha Reddy Promotions--Ram Charan Working For Saira Narasimha Reddy Promotions-

ఉత్తరాది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు అమితాబచ్చన్‌ సెంటర్‌గా చేసి ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.ఆ ప్రమోషన్‌ కార్యక్రమాలకు రామ్‌ చరణ్‌ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు.ఒక టాక్‌ షో తరహాగా చేసి పార్ట్‌లుగా దాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.

హిందీ కోసం స్పెషల్‌గా అమితాచ్చన్‌ మరియు చిరంజీవిలతో రామ్‌ చరణ్‌ ఒక టాక్‌ షో నిర్వహించబోతున్నాడట.

రామ్‌ చరణ్‌ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా హోస్ట్‌గా చేయలేదు.మొదటి సారి రామ్‌ చరణ్‌ను ఈ చిత్రం కోసం చూడబోతున్నాం.మరి చరణ్‌ ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నయనతార, బిగ్‌బి, జగపతిబాబు, విజయ్‌ సేతుపతితో పాటు ఇంకా పలువురు స్టార్స్‌ కూడా నటించారు..

ఇది 250 కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మరి అది ఈ చిత్రంకు సాధ్యం అవ్వాలి అంటే హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా బాగా ఆకట్టుకోవాల్సి ఉంది.అందుకోసం రామ్‌ చరణ్‌ స్వయంగా రంగంలోకి దిగాల్సిందే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.