చరణ్ 'RC16' లేటెస్ట్ అప్డేట్.. స్టార్ట్ కాబోయేది అప్పుడే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఆ తర్వాత చిరు సినిమాలో నటించిన ఆచార్య సినిమా రిలీజ్ అయ్యి ప్లాప్ అయినా ఈ బ్లాక్ బస్టర్ హిట్ ముందు ఆచార్య ప్లాప్ కనిపించ కుండా పోయింది.

 చరణ్ ‘rc16’ లేటెస్ట్ అప్డేట్.. స్టార్ట్ కాబోయేది అప్పుడే?-TeluguStop.com

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఈ పాత్రకు మంచి స్పందన లభించింది.

ఇక ఈ సినిమా తర్వాత అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

 చరణ్ ‘RC16’ లేటెస్ట్ అప్డేట్.. స్టార్ట్ కాబోయేది అప్పుడే?-చరణ్ RC16#8217; లేటెస్ట్ అప్డేట్.. స్టార్ట్ కాబోయేది అప్పుడే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.ఈయన సినిమాలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్నాయి.

ఈ సినిమా ప్రెసెంట్ శరవేగంగా షూట్ జరుపుకుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.

దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

ఇక రామ్ చరణ్ ఆర్సీ 15 తర్వాత గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమా కూడా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది అని చరణ్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు.ఈ డైరెక్టర్ బాలీవుడ్ లో తీసిన జర్సీ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

అయినా కూడా చరణ్ అతడితో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Telugu Shankar, Jersey, Ram Charan, Rc-Movie

ప్రెసెంట్ గౌతమ్ తిన్ననూరి స్క్రిప్ట్ ప్రిపరేషన్ లో ఉన్నాడు.ఇక ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.చరణ్ 16వ సినిమాపై తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.

ఈ సినిమా ఈ ఏడాదిలోనే స్టార్ట్ చెయ్యాలని గట్టి పట్టుదలతో ఉన్నారట.

ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో ఎట్టిపరిస్థితుల్లో స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నారని టాక్.

ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఈ సినిమాలో సౌత్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ను తీసుకున్నారని కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి.

మరి భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube