ఆ రెండు రోజులు ఇబ్బంది పడ్డామంటున్న ఉపాసన..!- Ram Charan Wife Upasana Shares Covid Quarantine Life Social Media

first two days wer chaotic because we did not know what to do says upasana, upasana, ram charan, covid negative, mega family, quarantine, rrr movie - Telugu Chaotic, Corona Positive, Covid Negative, First Two Days, First Two Days Wer Chaotic Because We Did Not Know What To Do Says Upasana, Mega Family, Quarantine, Ram Charan, Rrr Movie, Upasana

2020 సంవత్సరం డిసెంబర్ నెల 27వ తేదీన తనకు కరోనా సోకినట్లు స్టార్ హీరో రామ్ చరణ్ కీలక ప్రకటన చేశారు.కొన్ని రోజుల క్రితం చరణ్ కు కరోనా నెగిటివ్ నిర్దారణ అయింది.

 Ram Charan Wife Upasana Shares Covid Quarantine Life Social Media-TeluguStop.com

ప్రస్తుతం చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.హోం క్వారంటైన్ లో ఉండి చరణ్ కరోనాకు చికిత్స తీసుకున్నారు.

చరణ్ కు కరోనా సోకడంతో పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా ఉపాసన కూడా క్వారంటైన్ లో ఉన్నారు.

 Ram Charan Wife Upasana Shares Covid Quarantine Life Social Media-ఆ రెండు రోజులు ఇబ్బంది పడ్డామంటున్న ఉపాసన..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఉపాసన చరణ్ తో కలిసి క్వారంటైన్ లో ఉన్న రోజుల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కరోనా నుంచి కోలుకునే టైమ్ లో తొలి రెండు రోజులు ఇబ్బంది పడ్డామని తెలిపారు.చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత తమ సిబ్బంది గురించే ఎక్కువగా టెన్షన్ పడ్డామని ఉపాసన పేర్కొన్నారు.

చరణ్ కు కరోనా సోకిన విషయాన్ని సిబ్బందికి వెంటనే తెలియజేశామని తెలిపారు.

తాను కరోనా పరీక్షలు చేయించుకున్న సమయంలో నెగిటివ్ నిర్ధారణ అయిందని అయితే పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉండటంతో తాను కూడా చరణ్ తో పాటు క్వారంటైన్ లో ఉన్నానని ఉపాసన పేర్కొన్నారు.ఆ తరువాత తగిన జాగ్రత్తలు తీసుకున్నామని.వైద్యులు సూచనలు చేసినా తొలి రెండు రోజులు కొంత గందరగోళానికి గురయ్యామని అన్నారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉపాసన ఈ విషయాలను వెల్లడించారు.ఇబ్బందులు ఎదురైతే వాటిని ప్రేమ, అభిమానం, ఆప్యాయతల ద్వారా అధిగమించాలని భావించామని పేర్కొన్నారు.

ఇబ్బందులను ఎదుర్కొనే క్రమంలో మా బంధం, సిబ్బందితో తమకున్న అనుబంధం మరింత బలపడిందని ఉపాసన పేర్కొన్నారు.మరోవైపు చరణ్ ఆచార్య సినిమాలో సిద్ధా పాత్రలో నటిస్తుండగా ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.

#FirstTwo #Covid Negative #Corona Positive #Upasana #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు