టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన తాజాగా షేర్ చేసిన ఒక ఫోటో వల్ల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.గుడి గోపురంపై ప్రజలు నిల్చుని ఉన్నట్టు ఉండే ఫోటోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ ఫోటోపై సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో విమర్శలు వ్యక్తమైనా ఉపాసన మాత్రం వెనక్కు తగ్గలేదు.ఆ ఫోటోను సోషల్ మీడియాలో అలాగే ఉంచారు.
అయితే నెటిజన్ల విమర్శల గురించి కూడా ఉపాసన తాజా పోస్ట్ లో ప్రస్తావించారు.
తాజా పోస్ట్ లో ఉపాసన స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది మనలోనే పుడుతుందని భయం లేకుండా స్వేచ్ఛగా జీవించాలని పేర్కొన్నారు.
ఎప్పుడూ వికసిస్తూ ఉండాలంటూ ఉపాసన తను నవ్వుతున్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.విమర్శలను తాను ఎక్కువగా పట్టించుకోనని ఉపాసన చెప్పకనే చెప్పేశారు.ఉపాసన ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
చరణ్ స్టార్ హీరో అయినప్పటికీ చరణ్ సినిమాల విషయంలో జోక్యం చేసుకోవడానికి ఉపాసన ఇష్టపడరు.అయితే చరణ్ సినిమాలు విడుదలైన తర్వాత మాత్రం ఆ సినిమాలను కచ్చితంగా చూస్తారు.చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఉపాసన తన టాలెంట్ తో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.అయితే మెగాభిమానులు మాత్రం ఉపాసన వివాదాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు.ఉపాసనకు సోషల్ మీడియాలో రోజురోజుకు ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరుగుతోంది.
చరణ్ భార్య ఉపాసనను అభిమానించే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారనే సంగతి తెలిసిందే.