డిజాస్టర్ ఇచ్చిన బ్యూటీని పట్టుకున్న చరణ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Ram Charan Wants Kiara Advani In Acharya-TeluguStop.com

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వార్తలు వచ్చినా ప్రేక్షకులు తప్పకుండా ఫాలో అవుతున్నారు.

కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు తొలుత మహేష్ బాబు ఒప్పుకున్నా, కొన్ని కారణాల వల్ల తప్పుకున్నాడు.

దీంతో ఈ పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించేందుకు చిత్ర యూనిట్ ఒప్పించింది.అయితే ఈ సినిమాలో చరణ్ చేయబోయేది ఓ విద్యార్థి నాయకుడి పాత్ర అని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో చరణ్‌కు కూడా లవర్ ఉంటుందట.ఆ పాత్రలో తనకు మంచి ఫ్రెండ్ అయిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోవాలని చిత్ర యూనిట్‌కు సూచించాడట.

గతంలో చరణ్‌తో కలిసి కియారా ‘వినయ విధేయ రామ’ అనే సినిమాలో నటించగా అది పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.ఇప్పుడు మరోసారి ఆమెను చరణ్ రికమెండ్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారట.

కియారా బదలు వేరే బ్యూటీని తీసుకుంటే బాగుంటుందని వారు సలహా ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube