మోక్ష‌జ్ఞ వ‌ర్సెస్ చెర్రీ పై చేయి ఎవ‌రిదో..!   Ram Charan Vs Mokshagna – Sankranti Race     2016-12-30   22:47:04  IST  Raghu V

టాలీవుడ్‌లో 2016 సంక్రాంతి ఫైట్ ఎంత ర‌స‌వ‌త్త‌రంగా ఉందో 2017 ఫైట్ అంత‌కు మించిన ర‌స‌వ‌త్త‌రంగా మారింది. దాదాపు 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత టాలీవుడ్ అగ్ర‌హీరోలు మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ స‌మ‌రాన్ని హీటెక్కిస్తున్నారు. చిరు ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత త‌న కేరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 150వ సినిమాలో న‌టిస్తున్నాడు.

ఇటు బాల‌య్య కూడా త‌న 100వ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ రెండు సినిమాల‌లో ఏ హీరో సినిమా హిట్ అయ్యి పైచేయి సాధిస్తుందా అన్న ఆస‌క్తి అంద‌రిలోను నెల‌కొంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే ఈ పోటీ చిరు వ‌ర్సెస్ బాల‌య్య‌తో పాటు వారి వార‌సులు చెర్రీ వ‌ర్సెస్ మోక్ష‌జ్ఞ మ‌ధ్య కూడా జ‌రుగుతోది.

చిరు ఖైదీ నెంబ‌ర్ 150లో చెర్రీ ఓ గెస్ట్ రోల్ చేశాడు. ఓ సాంగ్‌లో తండ్రితో క‌లిసి చెర్రీ స్టెప్పులు వేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక బాల‌య్య 100వ సినిమా శాత‌క‌ర్ణిలో మోక్ష‌జ్ఞ కూడా ఓ కీల‌క పాత్ర పోషించాడ‌ట‌. ఇంట‌ర్న‌ల్‌గా విన‌ప‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం శాత‌క‌ర్ణి కుమారుడు పులోమావి క్యారెక్ట‌ర్‌లో మోక్షు క‌నిపించ‌నున్నాడ‌ట‌.

మ‌రి ఈ ప్రెస్టేజియ‌స్ సినిమాల‌లో అటు బాల‌య్య త‌న‌యుడు – ఇటు చెర్రీ త‌న‌యుడు కూడా గెస్ట్ రోల్స్‌లో క‌నిపిస్తున్నారు. మ‌రి ఈ గెస్ట్ రోల్స్‌లో ఎవ‌రి రోల్ ఇంట్ర‌స్ట్‌గా ఉంటుంది…ఫైన‌ల్‌గా ఈ రేసులో గెలుపు ఎవ‌రిది ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌రే ఇప్పుడు ఇంట్ర‌స్టింగ్‌గా మారింది