వంశీ పైడిపల్లితో చరణ్ సినిమా ఫిక్స్.. కానీ..?  

Ram Charan-Vamshi Paidipally Combo to repeat again, Ram Charan, Vamshi Paidipally,Evadu Movie, RRR Movie, Acharya, Ram Charan Back to back movies - Telugu Acharya, Dil Raju, Evadu Movie, Hero Ram Charan, Ram Charan, Ram Charan Back To Back Movies, Ram Charan Movie Fix, Ram Charan-vamshi Paidipally Combo To Repeat Again, Rrr Movie, Vamshi Paidipally, Vamsi Paidipally, Yevadu Movie

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.త్వరలో రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ లో పాల్గొననున్నారని సమ్మర్ లో ఆచార్య సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.

TeluguStop.com - Ram Charan Vamshi Paidipally Combination Soon

గతేడాది రామ్ చరణ్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకపోయినా ఈ ఏడాది మాత్రం రామ్ చరణ్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు.

TeluguStop.com - వంశీ పైడిపల్లితో చరణ్ సినిమా ఫిక్స్.. కానీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ ఎవరి డైరెక్షన్ లో నటిస్తారనే విషయం గురించి ఇప్పటివరకు స్పష్టత రాలేదు.కొన్నిరోజుల క్రితం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చరణ్ నటిస్తాడని వార్తలు వచ్చినా ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు చరణ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన వంశీ రామ్ చరణ్ కు ఒక కథను చెప్పి ఒప్పించారని సమాచారం.రామ్ చరణ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ తెరకెక్కిన ఎవడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా వంశీ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కే మరో సినిమాకు కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

అయితే ఈ సంవత్సరం చరణ్ ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం.రంగస్థలం సినిమా తరువాత చరణ్ నటించిన వినయ విధేయ రామ ఫ్లాప్ కావడంతో చరణ్ మాస్ సినిమాలతో పోలిస్తే నవ్యత ఉన్న కథలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారని తెలుస్తోంది.

#RamCharan #Dil Raju #Hero Ram Charan #Acharya #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు