రామ్ చరణ్ ట్రోఫీ - 2021.. ఆరు విభాగాల్లో పోటీలు ప్రారంభం!

మెగా హీరోల అభిమానులు అంటేనే సేవకు, స్వచ్ఛంద కార్యక్రమాలకు పెట్టింది పేరు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘RRR’ చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా రామ్ చరణ్ ట్రోఫీ – 2021′ పేరుతో క్లాసికల్ డాన్స్, వెస్టర్న్ డాన్స్, పాటల పోటీలు, సోలో యాక్టింగ్, షార్ట్ ఫిలిం మేకింగ్, బాడీ బిల్డింగ్ తదితర ఆరు విభాగాలలో డిసెంబర్ 9,10,11 తేదీలలో వైజాగ్ పబ్లిక్ లైబ్రరీ ఆడిటోరియంలో సెమీఫైనల్స్ నిర్వహిస్తున్నారు.

 Ram Charan Trophy 2021 Started In Vizag Competition In Six Divisions Details, Ra-TeluguStop.com

ఈ రోజు వైజాగ్ VJF ప్రెస్ క్లబ్లో రాష్ట్ర స్థాయి పోటీల పోస్టర్ ని ప్రముఖ స్టార్ మేకర్ సత్యానంద్ చేతుల మీదుగా ప్రారంభించగా, రాంచరణ్ ట్రోఫీని ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు, రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ, మెగా అభిమానులు & ఆర్గనైజర్లు సమక్షంలో ట్రోఫీని ప్రారంభించారు.ఈ ”రాంచరణ్ ట్రోఫీ ” పోటీలలో ఆరు విభాగాల్లో గెలిచిన ఫైనల్స్ విజేతలకు 19 – 12 -2021వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖ ఉడా చిల్డ్రన్స్ ఏరినా ఆడిటోరియం లో ప్రముఖ అతిధుల చేతుల మీదుగా కాష్ ప్రైజ్ సహాయ ట్రోఫీ బహుకరించబడుతుంది.

Telugu Classial Dance, Ram Charan, Solo, Vizag, Western Dance-Movie

ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం ‘ధనుంజయ ఛానల్’ నిర్వహిస్తోంది.ఈ మేరకు రాష్ట్ర చిరంజీవి యువత భవాని అధ్యక్షులు రవి కుమార్ ఒక ప్రకటన విడుదల చేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube