రూల్స్ బ్రేక్ చేసి నీతులు చెప్పిన రామ్ చరణ్

బాహుబలి భారి బడ్జెట్ సినిమా కాబట్టి, బడ్జెట్ రికవర్ కావాలంటే బాక్సాఫీస్ దగ్గర పోటి ఉండకూడదు కాబట్టి మహేష్ బాబు తన శ్రీమంతుడుని వాయిదా వేసుకున్నారు.ఇప్పుడు రుద్రమదేవిది కుడా దాదాపు అదే పరిస్థితి.

 Ram Charan Trolled Himself With Own Logic-TeluguStop.com

అందుకోసమే రామ్ చరణ్ కుడా బ్రూస్ లీ వాయిదా వేయాలని ఇండస్ట్రీ పెద్దలు కోరారు.దానికి చరణ్ నిరాకరించాడు.

మేము వాళ్ళ మీద పడలేదు, వాళ్ళే మా మీద పడ్డారు.రూల్స్ బ్రేక్ చేసింది నేను కాదు అని లాజిక్స్ చెప్పాడు చెర్రి.

అంతా బాగానే ఉంది.కాని ఈ లాజిక్ రామ్ చరణ్ కి వర్తించదా అని అడుగుతున్నారు సగటు సిని అభిమానులు.

విషయంలోకి వెళ్తే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సమయంలో నాయక్ చిత్రాన్ని, 1-నేనొక్కడినే సమయంలో ఎవడు చిత్రాలను విడుదల చేసాడు చరణ్.నాయక్ సినిమాను పక్కన పెడితే, ఎప్పుడో విడుదల చేయాల్సిన ఎవడుని ఆరు మాసాలు వాయిదా వేసి, తీసుకొచ్చి సరిగ్గా 1-నేనొక్కడినే ఎదురుగా పెట్టాడు రామ్ చరణ్.

డిజాస్టర్ గా నిలిచిన నేనొక్కడినే పోటిగా ఎవడు లేకపోయుంటే కాస్తో కూస్తో బడ్జెట్ రికవర్ చేసుకునేదేమో.మరి అప్పుడు మహేష్ వచ్చి రామ్ చరణ్ మీద పడలేదుగా, చరణ్ వచ్చి మహేష్ మీద పడ్డాడుగా.

రామ్ చరణ్ లాజిక్ ప్రకారం రూల్స్ బ్రేక్ చేసినట్టేగా !

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube