అటు ఇటు తిరిగి చివరకు మాటల మాంత్రికుడికే ఓటు..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Ram Charan Next Movie With Trivikram, Ram Charan, Trivikram, Surender Reddy, Rrr-TeluguStop.com

ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన మార్క్ వేసుకునేందుకు చరణ్ రెడీ అవుతున్నాడు.

అయితే ఆర్ఆర్ఆర్‌లో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా సోలో హీరోగా చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే చరణ్‌తో సినిమా చేసేందుకు పలువురు స్టార్ డైరెక్టర్స్ క్యూలో వేచి ఉన్నారు.ఈ క్రమంలోనే మహేష్ బాబుకు మహర్షి లాంటి సూపర్ హిట్ మూవీని అందించిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన నెక్ట్స్ చిత్రాన్ని చరణ్‌తో తెరకెక్కించేందుకు చాలా ప్రయత్నించాడు.

కానీ ఈ సినిమా ఎందుకో పట్టాలెక్కలేదు.ఇక మరో డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా సైరా చిత్రం తరువాత చరణ్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని తీయాలని చూస్తున్నాడు.

కానీ సురేందర్ చెప్పిన కథ చరణ్‌కు పెద్దగా నచ్చకపోవడంతో ఆయన ఈ సినిమాను పక్కనబెట్టాడు.ఇక ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని రూపొందించాలని చరణ్ ఆశపడుతున్నాడు.

దీంతో త్రివిక్రమ్ చరణ్ కోసం ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను రెడీ చేస్తున్నాడట.అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం తారక్ 30వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube