ఆచార్యలో చిరు కంటే ముందే చరణ్?  

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం కూడా ఒకటి.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TeluguStop.com - Ram Charan To Shoot First For Acharya Before Chiranjeevi

ఇక ఈ సినిమాతో మెగాస్టార్ కూడా మరోసారి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించాలని కసిగా చూస్తున్నాడు.కాగా ఈ సినిమా షూటింగ్ సగం వరకు జరుపుకున్న సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ ఏర్పడిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్ చేసుకోగా, మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అనే వార్తతో ఒక్కసారిగా ఈ సినిమా షూటింగ్ డైలమాలో పడిపోయింది.అయితే కొద్దిరోజులకే మెగాస్టార్ కరోనా నుండి కోలుకున్నట్లు తెలియడంతో ఆచార్య చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.

TeluguStop.com - ఆచార్యలో చిరు కంటే ముందే చరణ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించి ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.ఈ క్రమంలో ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేమియో పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను వెంటనే పూర్తి చేయాలని కొరటాల ఆలోచిస్తున్నాడు.

అటు చరణ్ కూడా వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని చూస్తున్నాడు.

దీంతో ఈ సినిమా షూటింగ్‌ను లాక్‌డౌన్ తరువాత తిరిగి ప్రారంభించే క్రమంలో చిరు కంటే కూడా మొదట చరణ్ ఈ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు ఆచార్య చిత్ర యూనిట్ తెలిపింది.

మొత్తానికి ఆచార్య చిత్రం అనుకున్న సమయానికే పూర్తి చేయాలని చిరు అండ్ టీమ్ భావిస్తున్నారు.ఇక ఈ సినిమాలో చిరు ఓ స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండగా, ఆయన సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

#Acharya #Ram Charan #Chiranjeevi #Koratala Siva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు