వినయ విధేయ రామ కాంబో మళ్లీ రిపీట్..?  

Ram Charan To Pair Again With Kiara - Telugu Chiru 152, Kiara Advani, Koratala Siva, Ram Charan, Vinaya Vidheya Rama

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ గతేడాది సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.ఈ సినిమాతో రామ్ చరణ్ మాస్ వర్గాల్లో తిరుగులేని రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని అనుకున్నారు అందరూ.

Ram Charan To Pair Again With Kiara

కానీ ఈ సినిమా రిలీజ్ రోజునే బొక్కబోర్లా పడటంతో అట్టర్ ఫ్లాప్ మూవీగా మిగిలింది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే.

వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉందని అనుకునేలోపే సినిమా ఫెయిల్యూర్ కావడంతో అమ్మడు ముంబై చెక్కేసి బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది.అయితే తాజాగా మరోసారి రామ్ చరణ్, కియారాతో జతకట్టనున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారాను బుక్ చేయాలని చూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ.దీనికి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.మరి వీరిద్దరిని మళ్లీ జంటగా చూస్తామా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఏదేమైనా తన అట్టర్ ఫ్లాప్ మూవీలో నటించిన బ్యూటీతో చరణ్ మరోసారి జోడి కడతాడా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test