'అనుభవించు రాజా' టీజర్..జూదగాడిగా రాజ్ తరుణ్!

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అనుభవించు రాజా. ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల అయ్యి మంచి అంచనాలే నెలకొన్నాయి.

 Ram Charan To Launch Anubhavinchu Raja Movie Teaser-TeluguStop.com

ఇక ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు.అంతేకాదు చరణ్ చిత్ర బృందానికి విషెష్ కూడా తెలిపారు.

ఈ సినిమా మొత్తం కోడి పందేలు, పేకాట వంటి విలాసాలను చూపించారు.

 Ram Charan To Launch Anubhavinchu Raja Movie Teaser-అనుభవించు రాజా’ టీజర్..జూదగాడిగా రాజ్ తరుణ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ టీజర్ లో ముందుగా భీమవరం లో జరిగే కోడి పందేలు సెటప్ తో స్టార్ట్ అయ్యింది.‘అనుభవించు రాజా‘ అంటూ పాత పాట ప్లే అవుతూ ఉండగా రాజ్ తరుణ్ ను విలాసాలకు అలవాటు పడిన జూదగాడిగా చూపించారు.ఆ తర్వాత రాజ్ తరుణ్ డైలాగ్స్ యాక్టింగ్ కూడా బాగా ఆకట్టుకున్నాయి.

బంగారం గాడు ఊరిలో ఉండగా.ఆడి పుంజు బరిలో ఉండగా ఇంకొకడు గెలవడం కష్టం అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

ఈ సినిమా మొత్తం కోడి పందేలు, పేకాట, డాన్స్ లు వంటి వాటికీ అలవాటు పడ్డ జల్సా రాయుడిగా రాజ్ తరుణ్ ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.బ్యాక్ గ్రౌంగ్ స్కోర్ కూడా ఈ టీజర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.రాజ్ తరుణ్ పాత్ర ద్యాంతం ఉల్లాసవంతంగా కనపడింది.

పూర్తిగా గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందో అలా చూపించడం ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా కాశిష్ ఖాన్ నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్పీ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను నిర్మస్తున్నారు.

త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించ బోతున్నారు.ఇక టీజర్ తోనే అభిమానులను ఈ సినిమా వైపుకు తిప్పుకున్నారు చిత్ర యూనిట్.

#Ramcharan #Kashish Khan #RajTarun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు