ఎన్టీఆర్‌ను చితక్కొట్టిన చరణ్.. పండగ చేసుకున్న జక్కన్న  

Ram Charan To Fight Ntr In Rrr-rajamouli,ram Charan,rrr,telugu Movie News

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ఇండస్ట్రీ జనం అప్పుడే అంచనాలు వేస్తు్న్నారు.

Ram Charan To Fight NTR In RRR-Rajamouli Ram Rrr Telugu Movie News

ఇక ఈ సినిమా రిలీజ్ కోసం కేవలం సౌత్ ప్రేక్షకులే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా వీరిద్దరి పాత్రల్లో తారక్ పాత్ర హైలైట్ కానుందని, చరణ్ పాత్ర కాస్త తక్కువ ప్రాముఖ్యత ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తు్న్నాయి.దీంతో జక్కన్న ఈ సినిమాలో చరణ్ పాత్రకూ కూడా ప్రాముఖ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

తాజాగా వీరిద్దరి మధ్య ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించినట్లు, ఈ ఫైట్‌లో తారక్‌ను చరణ్ పొట్టుపొట్టు కొడతడాని తెలుస్తోంది.

దీంతో చరణ్ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తమ అభిమాన హీరో పాత్రకు ప్రాధాన్యత ఇచ్చేందుకు జక్కన్న తీసుకున్న ప్లాన్ బాగుందని వారు అంటున్నారు.అయితే ఈ ఫైట్ సీక్వెన్స్‌ ఎపిసోడ్‌ను ఏకంగా పది రోజులపాటు షూటింగ్ జరిపారట చిత్ర యూనిట్.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2021 జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

తాజా వార్తలు

Ram Charan To Fight Ntr In Rrr-rajamouli,ram Charan,rrr,telugu Movie News Related....