విజయ్ 'లియో'లో మిస్టర్ బాక్సాఫీస్.. క్రేజీ రూమర్ వైరల్!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ ఒకరు.ఈయన తమిళ్ లో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

 Ram Charan To Be Part Of Thalapathy Vijay's Leo , Thalapathy Vijay, Vijay's Leo,-TeluguStop.com

ఇక తెలుగులో కూడా ఒక మాదిరిగా మార్కెట్ అయితే క్రియేట్ అయ్యింది.ఇటీవలే సంక్రాంతి కానుకగా ‘వారసుడు’ సినిమాతో వచ్చి మరో హిట్ అందుకున్నాడు.

ఈసారి ఏకంగా 300 కోట్ల మార్క్ ను దాటేశాడు విజయ్.

మరి ఇలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ ఇదే జోష్ తో వెంటనే తన 67వ సినిమాను కూడా స్టార్ట్ చేసాడు.

మాస్టర్ వంటి సినిమాను తెరకెక్కించి విజయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ తో దళపతి 67 సినిమా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే గ్రాండ్ గా చెన్నైలో స్టార్ట్ చేసి కాశ్మీర్ లో ఈ సినిమాలో విజయ్ కు జోడీగా త్రిష నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Telugu Ram Charan, Ramcharan, Vijays Leo-Movie

అలాగే సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చెయ్యనున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద అప్పుడే అంచనాలు భారీగా పెరిగాయి.వరుసగా ఈ సినిమా నుండి ఏదొక రూమర్స్ బయటకు వస్తూనే ఉన్నాయి.ఇక తాజాగా మరో అదిరిపోయే వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Telugu Ram Charan, Ramcharan, Vijays Leo-Movie

స్టార్ కాస్టింగ్ లో భాగంగా లోకేష్ ఈ సినిమాలో చాలా మందిని భాగం చేస్తున్నాడు.ఈ క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ బయటకు వచ్చింది.అదేంటంటే.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో కీ రోల్ లో చేసేందుకు లోకేష్ ఒప్పించ బోతున్నాడు అనే వార్త హాట్ టాపిక్ అవుతుంది.అయితే ఇది కేవలం రూమర్ మాత్రమే అని ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.

ఈ రోల్ కోసం ప్రస్తుతానికి ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube