తల్లికి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపిన రామ్ చరణ్...  

Ram Charan Teja Sends Special Wishes To His Mother - Telugu Ram Charan Teja, Ram Charan Teja And Surekha, Ram Charan Teja Birth Day Wishes, Ram Charan Teja News, Surekha Birth Day

టాలీవుడ్ లో తన స్వయంకృషితో ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ సాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా తోచినంత సహాయం చేసే వ్యక్తి అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి.అయితే మెగాస్టార్ చిరంజీవికి ఎప్పుడు తన అండదండలు అందిస్తూ తన ప్రతి విజయం వెనుక నిలబడుతూ ఉండేటువంటి ఆయన సతీమణి కొండ సురేఖ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ తేజ్ తన తల్లికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

Ram Charan Teja Sends Special Wishes To His Mother

అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ తన భార్య ఉపాసన కొణిదెలతో కలిసి కొణిదెల సురేఖ పుట్టినరోజుని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.అయితే ఇందులో భాగంగా రామ్ చరణ్ తేజ్ కొన్ని ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.

దీంతో పలువురు నెటిజన్లు సురేఖమ్మ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలు మరియు వ్యాపార విషయాలలో బిజీ బిజీగా గడుపుతున్న ప్పటికీ సురేఖ మాత్రం కుటుంభం వ్యవహారాలను చక్కదిద్దుతూ మంచి పథంలో నడిపిస్తున్నారు.గతంలో కూడా రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కూడా ఈ విషయం గురించి పలుమార్లు చెప్పుకొచ్చారు.అయితే రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో అప్పట్లో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి  అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదలవుతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.

తాజా వార్తలు