తెరపైకి మరో మల్టీ స్టారర్.... ఎవరెవరో తెలుసా...?  

Ram Charan Tej Wants To Remake Billa Ranga Movie Telugustop - Telugu Billa Ranga Movie, Manchu Manoj Movie Latest News, Manchu Manoj Movie News, Ram Charan Tej Movie Latest News, Ram Charan Tej Movie News, Ram Charan Tej Wants To Remake Billa Ranga Movie

1980వ సంవత్సరంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటించినటువంటి బిల్లా రంగా అనే చిత్రం ఇప్పటి తరం వాళ్ళకి తెలియనప్పటికీ, అప్పటి తరం వాళ్ళకి మాత్రం బాగానే గుర్తు ఉంటుంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.

 Ram Charan Tej Wants To Remake Billa Ranga Movie Telugustop

ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం వహించాడు.చిరంజీవి మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ చిత్రం అప్పట్లో పలు రికార్డులను కొల్లగొట్టింది.అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోలు రీమేక్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.

అయితే ఆ విషయం లోకి వెళితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తండ్రి నటించినటువంటి బిల్లా రంగా చిత్రాన్ని రీమేక్ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.అంతేగాక ఇప్పటికే రామ్ చరణ్ తేజ్ తో సన్నిహితంగా ఉంటున్నటువంటి ఓ దర్శకుడికి కూడా బిల్లా రంగా ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ ని రెడీ చేయమని సూచించాడట.

తెరపైకి మరో మల్టీ స్టారర్…. ఎవరెవరో తెలుసా…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్రలో మోహన్ బాబు రెండవ తనయుడు మంచు మనోజ్ నటింపజేయాలని అనుకున్నట్లు సమాచారం.

దీంతో దర్శకుడు కూడా మంచు మనోజ్ తో ఈ విషయాల గురించి సంప్రదించగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.అయితే వీళ్ళిద్దరూ సినీ పరిశ్రమ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులు.అందువల్లనే రామ్ చరణ్ మంచు మనోజ్ కలిసి తమ తండ్రులు నటించినటువంటి బిల్లా రంగా చిత్రాన్ని రీమేక్ చేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మంచు మనోజ్ నటిస్తున్న అహం బ్రహ్మాస్మి చిత్ర ప్రారంభోత్సవానికి కూడా హాజరయ్యాడు.దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు సినీ పరిశ్రమలో వీరి మైత్రి ఎలా ఉందో అని.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ స్వాతంత్య్రం కోసం పోరాడి అమరుడు అయినటువంటి అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు