సూపర్ స్టార్ మహేష్ ని టార్గెట్ చేసేసారు.శ్రీమంతుడు వచ్చి ఈ మధ్యే 50 రోజులు దాటాయి.
అప్పుడే శ్రీమంతుడు రికార్డుల మీద కన్నేశాడు రామ్ చరణ్.చాలా గాట్టి ప్లాన్ వేసేసారు మహేష్ ను దెబ్బతీయడానికి.
ఇప్పటికే ఓవర్సీస్ లో మహేష్ సామ్రాజ్యానికి గండి కొట్టేందుకు మహేష్ బాబు సినిమాల కన్నా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు బ్రూస్ లీ ని.తాజా వార్త ఏంటంటే, బ్రూస్ లీ కోసం వైజాగ్ తో సహా చాలా ఏరియాల్లో టికెట్ రేట్స్ పెంచేశారు.ఇది శ్రీమంతుడు కన్నా చాలా ఎక్కువ.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కుడా శ్రీమంతుడు కన్నా పెద్ద రిలీజ్ బ్రూస్ లీ కి దక్కేలా ప్లాన్ వేసారు.ఏ రకంగా చూసినా మొదటిరోజు మహేష్ రికార్డ్స్ కి గట్టి పోటి తప్పదు, ఒకేవేళా రికార్డులు బద్దలైనా బద్దలవోచ్చు.
మెగాస్టార్ సినిమాలో ఉండటం వలనే కావచ్చు, చాల ధైర్యంగా ఉంది బ్రూస్ లీ యూనిట్.
మరి బ్రూస్ లీ శ్రీమంతుడు రికార్డ్స్ ని దాటేస్తుందా ? పవన్ తరువాత రామ్ చరణ్ మహేష్ కి మరో పోటిదారుగా తయారవుతాడా తెలియాలంటే ఈ 16 వరకు ఆగాల్సిందే.