అప్పటి వరకు రామ్‌ చరణ్‌ లాంగ్‌ బ్రేక్‌... గేమ్‌ ఛేంజర్‌ ప్లాన్స్ అన్నీ వాయిదా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram charan )లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నాడు అంటూ మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతుంది.సాధారణంగా రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంటాడు.

 Ram Charan Taking Long Break For Shootings  , Ram Charan , Upasana , Shootings ,-TeluguStop.com

కానీ ఈ సారి మాత్రం అతడు నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌( Game Changer _ సినిమా షూటింగ్ ఉన్నా కూడా బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.అందుకోసం దర్శకుడు శంకర్ కి విజ్ఞప్తి చేసి గేమ్ ఛేంజర్‌ సినిమా యొక్క షెడ్యూల్ వాయిదా వేయడం జరిగినట్లుగా సమాచారం అందుతుంది.

ఇంతకు రాంచరణ్ లాంగ్ బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే త్వరలోనే రామ్ చరణ్ తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఉపాసన గర్భవతిగా ఉంది.

Telugu Dil Raju, Game Changer, Ram Charan, Shankar, Tollywood, Upasana-Movie

అతి త్వరలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వబోతుంది.ప్రస్తుతం ఉపాసన నెలలు నిండి ఉండడంతో ఈ సమయంలో ఆమెకు పక్కనే రామ్ చరణ్ ఉండాలని భావించాడట.అంతే కాకుండా ఆమె ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలని కూడా రామ్ చరణ్ భావిస్తున్నాడు.అందుకే ఆమె ను ప్రతి విషయంలో కూడా చూసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడట.

Telugu Dil Raju, Game Changer, Ram Charan, Shankar, Tollywood, Upasana-Movie

రామ్ చరణ్ ఉపాసన ( Upasana )ఇద్దరు కలిసి విహార యాత్రలు చేయడంతో పాటు స్థానికంగా ఉన్న చూడదగ్గ ప్రదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.ఉపాసన బిడ్డకు జన్మనిచ్చే వరకు రామ్ చరణ్ ఆమెను వదిలకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అందుకే షూటింగ్స్ కి ఇతర కార్యక్రమాలన్నింటికీ కూడా బ్రేక్ ఇచ్చి మరి పూర్తిగా చరణ్ ఇంటికే పరిమితం అయ్యాడు.వీరి పెళ్లి అయ్యి పది సంవత్సరాలు అవుతుంది.

ఎప్పుడు కూడా ఇద్దరు బిజీబిజీగా గడుపుతూ వస్తున్నారు.ఈ పది సంవత్సరాల కాలంలో వారిద్దరూ కలిసి ఉన్నది చాలా తక్కువ సమయం.

కనుక ఈ సమయంలో వారిద్దరు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.ఇద్దరికీ కూడా ఇది ఒక మంచి సమయం అంటూ వారి బంధువులు మిత్రులు అంటున్నారు.

రామ్ చరణ్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న సమయంలో ఉపాసన వ్యాపార కార్యక్రమాలతో బిజీగా ఉంటుంది.కనుక ఇద్దరికీ కలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

అందుకే ఉపాసన మరియు రాంచరణ్ ఇప్పుడు ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.చరణ్ తండ్రి అయిన తర్వాత కొన్ని వారాలకి మళ్లీ షూటింగ్స్ కి హాజరయ్యే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube