క్లిక్‌ క్లిక్ : స్టైలిష్‌ లుక్‌ తో ఎయిర్ పోర్ట్ లో సూపర్‌ ఎంట్రీ ఇచ్చిన అల్లూరి

మెగా హీరో రామ్‌ చరణ్‌ స్టైలిష్ లుక్ లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌ లో సందడి చేశారు.హాలీడే కు వెళ్లిన రామ్‌ చరణ్ తాజాగా స్టైలిష్ లుక్ తో హైదరాబాద్ లో ప్రత్యక్షం అయ్యాడు.

 Ram Charan Stylish Look In Airport , Ram Charan ,  Stylish Look , Tollywood , Rr-TeluguStop.com

పెద్ద ఎత్తున ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.సాదారణంగానే రామ్‌ చరణ్ ఫొటోలు అంటూ సోషల్‌ మీడియాలో హడావుడి చేయడం ఖాయం.

కాని ఈసారి ఆయన స్టైలిష్‌ లుక్ కు అంతా కూడా ఫిదా అవుతున్నారు.అత్యంత ఆధునికమైన టీ షర్ట్‌ తో పాటు ఆయన ఆకర్షణీయమైన మేకోవర్ ఇంకా వాకింగ్‌ స్టైల్ అన్ని కలిపి ఆయన్ను మళ్లీ నెట్టింట సందడి చేసేలా చేశాయి అనడంలో సందేహం లేదు.

పెద్ద ఎత్తున అంచనాలున్న రామ్‌ చరణ్‌ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్దం అవుతున్నాయి.

ఈ సమయంలో ఆయన ఇలాంటి లుక్ లో అభిమానులకు కనిపిస్తే ఏమైనా ఉందా అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

ఎప్పుడు లేనిది చరణ్ చాలా స్టైలిష్‌ యాంగిల్ లో సోషల్‌ మీడియాలో ఈసారి ఎక్స్ పోజ్‌ అవ్వడంకు కారణం ఏమై ఉంటుందో అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
Telugu Rajamouli, Ram Charan, Shankar, Shanker, Tollywood-Movie

రామ్‌ చరణ్ నటించిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.మరో వైపు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా ఇప్పటికే పట్టాలెక్కింది.ఆ సినిమా మొదటి షెడ్యూల్‌ ను పుణె లో భారీ ఎత్తున నిర్వహించారు.

హెలికాప్టర్‌ ఉపయోగించి మరీ భారీ గా ఖర్చు చేసి ఆ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.త్వరలో హైదరాబాద్ లో సినిమా చిత్రీకరణ పునః ప్రారంభం అవ్వబోతుంది.స్టైలిష్ లుక్ లో శంకర్ మూవీలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఆర్ ఆర్ ఆర్‌ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే చరణ్‌ ఈ సినిమా మొదలు పెట్టడం అభిమానులకు ఆనందంను కలిగిస్తుంది.

రామ్ చరణ్‌ ఈ నెల చివరి నుండి ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎన్టీఆర్‌ తో కలిసి పాల్గొనాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube