మెగా 152 కు డేట్‌ ఫిక్స్‌  

Ram Charan Starts Chiranjeevi 152th Movie-chiranjeevi 152th Movie,koratala Shiva,ram Charan,tollywood Box Office,tollywood New Releasing Movies

చిరంజీవి సైరా చిత్రం పూర్తి చేయకుండానే కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే.ఇప్పటికే షూటింగ్‌ కూడా ప్రారంభం అవ్వాల్సి ఉంది.కాని సైరా చిత్రం కోసం చిరు చాలా ఎక్కువ కష్టపడ్డాడు.దాంతో ఒకే సారి రెండు సినిమాలు అంటే కష్టం అనే ఉద్దేశ్యంతో సైరా విడుదలైన తర్వాత తదుపరి చిత్రం మొదలు పెట్టాలని చిరంజీవి భావించాడు.అందుకు కొరటాల శివ కూడా ఒప్పుకుని దాదాపు ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తూ వస్తున్నాడు.

Ram Charan Starts Chiranjeevi 152th Movie-chiranjeevi 152th Movie,koratala Shiva,ram Charan,tollywood Box Office,tollywood New Releasing Movies-Ram Charan Starts Chiranjeevi 152th Movie-Chiranjeevi Movie Koratala Shiva Ram Tollywood Box Office Tollywood New Releasing Movies

Ram Charan Starts Chiranjeevi 152th Movie-chiranjeevi 152th Movie,koratala Shiva,ram Charan,tollywood Box Office,tollywood New Releasing Movies-Ram Charan Starts Chiranjeevi 152th Movie-Chiranjeevi Movie Koratala Shiva Ram Tollywood Box Office Tollywood New Releasing Movies

ఎట్టకేలకు ఈ చిత్రం పట్టాలెక్కేందుకు సిద్దం అయ్యింది.సైరా చిత్రంను అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.కొరటాల శివ తన స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుని పెట్టుకుని అన్ని పక్కా ప్లానింగ్‌తో ఎదురు చూస్తున్నాడు.నవంబర్‌ 3న సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.అదే నెల 10 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌కు తీసుకు వెళ్లబోతున్నారు.మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా సినిమాను సమ్మర్‌ లేదా దసరాకు విడుదల చేయాలని భావిస్తున్నారు.

చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం.150, 151వ చిత్రం ‘సైరా’ చిత్రాలను నిర్మించిన రామ్‌ చరణ్‌ ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నాడు.చిరంజీవి 152 చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నిర్మించబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది.అయితే ఈ చిత్ర నిర్మాణంలో కొరటాల సన్నిహితులు కూడా భాగస్వామ్యం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.