ఆచార్య లో చరణ్‌.. మీకు ఈ విషయం తెలుసా?- Ram Charan Shoot Complete In Acharya Movie

Ram charan shoot complete in acharya movie-tollywood-acharya-pan india-rrr movie-ramcharan-kajal-summer relese-koratala shiva - Telugu Acharya, Chiranjeevi, Koratalasiva, Rajamouli, Ramcharan, Rrr

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు.రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ ల మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నాడు.

 Ram Charan Shoot Complete In Acharya Movie-TeluguStop.com

మరోవైపు ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.చిరంజీవి హీరోగా కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే చరణ్ ఆచార్య షూటింగ్ సెట్ లో పాల్గొంటున్నట్లుగా ఆయన ప్రీ లుక్ ను విడుదల చేశారు.

 Ram Charan Shoot Complete In Acharya Movie-ఆచార్య లో చరణ్‌.. మీకు ఈ విషయం తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెగా, సినీ అభిమానుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

తాజా సమాచారం మేరకు ఆచార్య లో చరణ్ పాత్ర కు సంబందించిన షూటింగ్ పూర్తి అయినట్లుగా సోషల్ మీడియా లో కథనాలు వస్తున్నాయి.అతి తక్కువ సమయమలోనే దర్శకుడు ఈ కీలక పాత్రకు సంబందించిన పోర్షన్ షూట్ ను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది.

ఆచార్య కు చరణ్ పాత్ర హైలెట్ అవ్వుతుందని చిత్ర యూనిట్ చెబుతుంది.మెగాస్టార్ చిరంజీవికి శిష్యుడుగా చరణ్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయక పాత్రలో నటిస్తుంది.చరణ్ కి జోడీగా ఓ ప్రముఖ హీరోయిన్ నటించనున్నది.త్వరలోనే ఆ విషయంను అధికారికంగా చిత్రా బృందం ప్రకటించనున్నది.

ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చెయ్యడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే చరణ్ మలయాళం మూవీ లూసిఫర్ ను ఆయన నిర్మాణంలో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఫైనల్ యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

.

#Chiranjeevi #Ramcharan #Koratalasiva #Acharya #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు