శర్వా కోసం ఒక మంచి కథను త్యాగం చేసిన చరణ్‌?  

Ram Charan Sharwanand Uv Creations - Telugu Ram Charan, Ram Charan Movie To Sharwanand, Sharwanand, Uv Creations

యూవీ క్రియేషన్స్‌లో శర్వానంద్‌ ఒక సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.కెరీర్‌లో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న శర్వానంద్‌కు యూవీ క్రియేషన్స్‌ మూవీలో నటించే అవకాశం రావడంతో శర్వానంద్‌ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

 Ram Charan Sharwanand Uv Creations

అయితే ఈ ఆఫర్‌ను శర్వానంద్‌కు ఇచ్చింది రామ్‌ చరణ్‌ గా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.చరణ్‌ సూచన మేరకు శర్వాకు ఆ ఛాన్స్‌ దక్కిందట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ చరణ్‌ వద్దకు యూవీ క్రియేషన్స్‌కు చెందిన ఒక రచయిత కథను తీసుకు వెళ్లగా ఆ కథ చరణ్‌కు బాగా నచ్చిందట.తప్పకుండా చేయాలని కూడా అనుకున్నాడట.

కాని ఆ కథ తనకంటే కూడా శర్వానంద్‌కు బాగుంటుందని, అలాగే ప్రస్తుతం అతడు ఉన్న ఇబ్బందుల నుండి కూడా బయట పడే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో చరణ్‌ ఆ ప్రాజెక్ట్‌ను శర్వాకు మరలించాడట.

శర్వా కోసం ఒక మంచి కథను త్యాగం చేసిన చరణ్‌-Movie-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్నాడు.ఆ తర్వాత యూవీ క్రియేషన్‌లో ఒక చిత్రాన్ని చరణ్‌ చేయాల్సి ఉంది.ఆ సినిమా కోసం మరోకథను తయారు చేయించే పనిలో నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్ లు ఉన్నారు.

ఈ ఏడాది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి అవ్వనుండగా వచ్చే ఏడాదికి యూవీ క్రియేషన్స్‌లో చరణ్‌ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.యూవీ క్రియేషన్స్‌లో శర్వామూవీ కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ram Charan Sharwanand Uv Creations Related Telugu News,Photos/Pics,Images..

footer-test