ఆచార్య షూట్ లో పాల్గొన్న తండ్రి కొడుకులు... వైరల్ ఫోటో

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

 Ram Charan Shares Pic From Acharya Sets, Tollywood, Megastar Chiranjeevi, Korat-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకి వచ్చేయడంతో రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.ఆచార్య సినిమాలో సిద్దా అనే పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు.

ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని గతంలోనే రివీల్ చేశారు.ఇక చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రంగా దీనిని కొరటాల తెరపై ఆవిష్కరిస్తున్నాడు.

రామ్ చరణ్ కోసం హీరోయిన్ ని కూడా ఖరారు చేశారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో మళ్ళీ రామ్ చరణ్ పాల్గొన్నాడు.

ఈ సినిమాలో రామ్ చరణ్, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలని షూట్ చేస్తున్నారు.ఈ విషయాన్ని దర్శకుడు కొరటాల శివ దృవీకరించారు.

ప్రస్తుతం ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ని దర్శకుడు కొరటాల షూట్ చేస్తున్నాడు.దీనికి సంబందించిన లుక్ ని రామ్ చరణ్ ట్విట్టర్ లో షేర్ చేసుకుంటూ కామ్రేడ్ మూమెంట్.

ఆచార్య సెట్ చిరంజీవి, కొరటాల గారితో షూట్ ని ప్రతిక్షణం ఎంజాయ్ చేస్తున్న అంటూ పోస్ట్ పెట్టాడు.ఈ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

రామ్ చరణ్ భుజం మీద చిరంజీవి చేయి వేసి ఉన్నట్లు ఈ ఇమేజ్ లో ఇక మెగా ఫాన్స్ ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.ఇక ఈ ఫోటో, రామ్ చరణ్ పెట్టిన కామెంట్ బట్టి ఆచార్య సినిమాలో చరణ్ నక్షల్స్ నాయకుడుగా కనిపించబోతున్నాడని అర్ధమవుతుంది.

మరి పవర్ ఫుల్ మాస్ కథాంశంతో తండ్రి కొడుకుల కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఈ స్థాయిలో ప్రేక్షకులని అలరిస్తుంది అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube