ఆర్సీ 15 రిలీజ్ డేట్ ఫిక్స్.. షూటింగే పూర్తికాని సినిమాకు సీటు రిజర్వ్?

Ram Charan Shankar Rc15 Release Date Fixed

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం RRR.అన్ని అనుకూలించి ఉంటే ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

 Ram Charan Shankar Rc15 Release Date Fixed-TeluguStop.com

అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.ఇక ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాల పై ఫోకస్ పెట్టారు.

ఇలా రామ్ చరణ్ దిల్ రాజు నిర్మాణంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

 Ram Charan Shankar Rc15 Release Date Fixed-ఆర్సీ 15 రిలీజ్ డేట్ ఫిక్స్.. షూటింగే పూర్తికాని సినిమాకు సీటు రిజర్వ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే నిర్మాత దిల్ రాజు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ హీరోగా రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు చిత్రం మ్యూజిక్ ఈవెంట్లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ…చరణ్ ఈ సంక్రాంతికి రాకపోయినా వచ్చే సంక్రాంతికి తప్పకుండా వస్తాడని తన నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమా గురించి ప్రకటించారు.

Telugu Shankar, Kiara Advani, Dil Raju, Ram Charan, Rc, Fix, Suneel, Thaman, Tollywood-Movie

దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలతో వచ్చే సంక్రాంతికి బడా నిర్మాత తన బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్ పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అదేవిధంగా ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

#Fix #Ram Charan #Kiara Advani #Shankar #Dil Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube