చరణ్ శంకర్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో రచ్చ!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం విదితమే.శంకర్ డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనీ ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇప్పటికి రామ్ చరణ్ సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు.

 Ram Charan Shankar Project Latest Crazy Update, Ram Charan, Shankar Charan Proje-TeluguStop.com

ఈయన సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అందుకే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి.

ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మించ బోతున్నారు.ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ఈ సినిమాను లాంచ్ చేసారు.

ఇక ఈ సినిమా ఎలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది రామ్ చరణ్ ఎలా కనిపిస్తాడా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ విషయంపై ప్రెసెంట్ సోషల్ మీడియాలో రచ్చ మొదలయ్యింది.

Telugu Dil Raju, Rajamouli, Ram Charan, Ramcharan, Rc, Shankarcharan-Movie

ఈ సినిమాలో శంకర్ కార్పొరేట్ సంస్థలు భారతీయ చట్టాలను అడ్డు పెట్టుకుని ఎలా కోట్లు సమాధిస్తున్నాయో అనే విషయాన్నీ చూపించ బోతున్నారని చర్చ జరుగుతుంది.ఇలా అక్రమ మార్గాల్లో సంపాదించాలని అనుకునే వారికీ బుద్ధి చెప్పడానికి రామ్ చరణ్ రంగం లోకి దిగుతున్నాడని వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విశాలన్నిటిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

ఇక రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ”ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా త్వరలోనే విడుదల తేదీని ప్రకటించ బోతున్నారు.ఈ సినిమాలో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే.ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.

ఈ సినిమా కోసం ఆల్ ఓవర్ ఇండియా ఎదురు చూస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube