ఇద్దరిలో ఎవరైనా ఓకే అంటున్న చరణ్ ఫ్యాన్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది.అలా అనౌన్స్ చేయగానే అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.50 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా కోసం దిల్ రాజు తన కెరీర్ లో మొదటిసారి భారీ బడ్జెట్ పెడుతున్నాడు.అయితే ఈ ప్రాజెక్ట్ అలా అనౌన్స్ చేసారో లేదో అప్పటి నుండి ఏదో ఒక గాసిప్ వస్తూనే ఉన్నాయి.

 Ram Charan Shankar Movie Heroine, Kiara Advani, Alia Bhatt, Ram Charan, Shankar,-TeluguStop.com

ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఎప్పటి నుండో భారీగా చర్చ జరుగుతుంది.

చరణ్ తో ఎవరు నటించబోతున్నారని విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే చాలా మంది ముద్దు గుమ్మలు పేర్లు వినిపించాయి.

అందులో కియారా అద్వానీ పేరు ముందు వరుసలో ఉంది.ఇప్పుడు ఆలియా భట్ పేరు కూడా వినిపిస్తుంది.

Telugu Alia Bhatt, Kiara Advani, Ram Charan, Shankar-Movie

ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది.మళ్ళీ ఈ సినిమాలో కూడా ఈమె పేరే వినిపిస్తుంది.అయితే ఈ విషయంలో చరణ్ ఫ్యాన్స్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.అటు ఆలియా భట్, ఇటు కియారా అద్వానీ ఎవరైనా ఓకే అంటూ చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు.

మరి శంకర్ వీరిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేస్తారో లేకపోతే మరొక హీరోయిన్ ను తీసుకు వస్తారో వేచి చూడాల్సిందే.

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

అటు శంకర్ కూడా ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube