ఆచార్య సినిమాలో తన ఫేవరెట్ సీన్ అదే: రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత వస్తున్న చిత్రం ఆచార్య.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు.

ఇక ఈ సినిమా 29వ తేదీ విడుదలకు సిద్ధమైంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న చిత్ర బృందాన్ని విలేకరులు పలురకాల ప్రశ్నలు అడుగుతూ ఆశక్తికరమైన సమాధానాలను రాబట్టారు.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ ప్రశ్నిస్తూ ఆచార్య సినిమాలో మీకు నచ్చిన మీ ఫేవరెట్ సీన్ ఏది అని ప్రశ్నించగా .ఈ ప్రశ్నకు రామ్ చరణ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.ఈ సినిమాలో భాగంగా అడవులలో ఒక చెరువు ఒడ్డున చరణ్ నీళ్లు తాగుతూ ఉండగా అవతలి ఒడ్డున చిరుత పిల్ల కూడా నీళ్లు తాగుతూ ఉంటుంది.

Advertisement

ఇక ఆ చిరుత పిల్ల వెనక తన తల్లి ఉండగా.చరణ్ వెనకాలే మెగాస్టార్ ఉంటారు.ఈ సీన్ తనకు ఎంతో ఇష్టమని రామ్ చరణ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇక ఈ సినిమా పోస్టర్ రిలీజ్ లో భాగంగా ఈ పోస్టర్ విడుదల చేయడంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.అప్పటినుంచి ఈ సీన్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో చరణ్ ఫేవరెట్ సీన్ కూడా అదే అని చెప్పడం గమనార్హం.

ఇక ఈ సినిమాలో చరణ్ సుమారు 40 నిమిషాల పాటు సందడి చేయనున్నారు.ఆచార్య సినిమా కథ మొత్తం చరణ్ చుట్టూ తిరుగుతుందని, ఈ సినిమాకి చరణ్ పాత్ర కీలకంగా ఉందని సమాచారం.

ఏది ఏమైనా తండ్రి కొడుకులు ఇద్దరిని కలిసి ఇలా ఒకే తెరపై చూడటానికి మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు