హిందీలో మార్మోగిపోతున్న 'రంగస్థలం' పేరు.. ఎందుకంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో సూపర్ హిట్ అయినా సినిమాల్లో రంగస్థలం ఒకటి.ఈయన కెరీర్ లో మగధీర తర్వాత ఆ స్థాయి సినిమా అంటే రంగస్థలం అనే చెప్పాలి.

 Ram Charan Samantha Rangasthalam To Be Released In Hindi Details, Rangasthalam,-TeluguStop.com

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాతో చరణ్ తనలోని మరొక కోణాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసాడు.

చరణ్ లోని పరిపూర్ణ నటుడు రంగస్థలం సినిమా ద్వారానే బయటకు వచ్చి మెగా ఫ్యాన్స్ ను ఉర్రుత లూగించింది.రామ్ చరణ్ కెరీర్ లో రంగస్థలం ఒక మైలు రాయిగా నిలిచి పోవడానికి చరణ్ నటన తో పాటు సుకుమార్ మేకింగ్ కూడా కారణం.

మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు ఏళ్ళు నిండిన కూడా ఇప్పటికి ప్రేక్షకులు ఈ సినిమాను ఇంట్రెస్ట్ గా చూస్తారు.

మరి ఇదంతా పక్కన పెడితే 2018 లో తెలుగులో రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది.

అందుకు ఒక కారణం కూడా ఉంది.తెలుగు మూడేళ్ళ క్రితం రిలీజ్ అయినా ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

హిందీలో ఇప్పుడు ఈ సినిమా పై క్రేజీ బజ్ నెలకొండడంతో ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అవుతుందని.అవ్వాలని అభిమానులు సహా సినీ వర్గాలు కూడా కోరుకుంటున్నారు.

హిందీలో ఈ సినిమాను వచ్చే ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ ఒక క్లారిటీ రాదు.

మరి హిందీలో ఈ సినిమాను అదే పేరుతొ రిలీజ్ చేస్తారో.లేదంటే పేరు మారుస్తారో చూడాలి.

Ram Charan Samantha Rangasthalam To Be Released In Hindi Details, Rangasthalam, Ram Charan, Samantha, Sukumar, Bollywood, Rangasthalam Movie, Rangasthalam Hindi Release, Tollywood - Telugu Bollywood, Ram Charan, Rangasthalam, Samantha, Sukumar, Tollywood

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube