అల్లూరి యాసతో అదరగొట్టనున్న చరణ్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Ram Charan Accent In Rrr For Ramaraju, Ram Charan, Rrr, Ntr, Rajamouli, Tollywoo-TeluguStop.com

ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఇటీవల రామ్ చరణ్ నటించిన అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేయగా దానికి తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

దీంతో ఈ వీడియోకు ఓ రేంజ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.కాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న కొమురం భీం పాత్రకు సంబంధించిన వీడియో కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే కొమురం భీం పాత్రలో తారక్ తెలంగాణ యాసలో మాట్లాడిన డైలాగులకు భారీ ఆదరణ లభించడంతో, ఇప్పుడు అందరి చూపు చరణ్ మాట్లాడే యాసపై పడింది.

అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లాకు చెందిన వ్యక్తి.

మరి ఆయన పాత్రలో నటిస్తున్న చరణ్, ఎలాంటి యాసలో మాట్లాడబోతున్నాడనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఫారిన్ బ్యూటీ ఒలివియా మారిస్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube