ఐశ్వర్యకి 6 కోట్లు ఇస్తున్న చిరంజీవి - రామ్ చరణ్

బాహుబలి వలన మన తెలుగు సినిమా మార్కేట్ స్థాయి పెరిగిపోయింది.ఇప్పుడు కథాబలం ఉన్న తెలుగు సినిమాలని ఇటు తమిళం, మళయాలంలో కాని అటు హిందీలో కాని అనువదించి మంచి డిస్ట్రీబ్యూటర్ల చేతిలో పేడితే ఆ సినిమా జాతకం మారినా మారిపోవచ్చు.

 Ram Charan Ready To Pay 6cr For Aishwarya Rai-TeluguStop.com

అదే ఆశతో మహేష్ బాబు “స్పైడర్” ని 110 కోట్లకు పైగా బడ్జేట్ తెలుగు – తమిళ భాషల్లోకి తెరకెక్కించి, మలయాళ, హిందీ భాషల్లోకి అనువదిస్తున్నారు.ప్రభాస్ నటిస్తున్న సాహో కూడా ఈ నాలుగు భాషల్లో విడుదల కానుంది.

భరత్ అనే నేను కూడా తమిళ, మలయాళ ప్రేక్షకులకి చేరనుంది.ఈ జెనెరేషన్ స్టార్ హీరోలకి నేనేం తక్కువ, మహేష్, ప్రభాస్ కి ఉన్న పాపులారిటి తనకు కూడా ఉందంటూ మెగా స్టార్ కూడా మార్కేట్ ని విస్తరించుకునే ఆలోచనలో పడ్టారు.

ఉయ్యాలవాడ సరసింహారెడ్డి కూడా భారి బడ్జెట్ తోనెడ తెరకెక్కనుంది.ఈ సినిమాలో కూడా పెద్ద పెద్ద సెట్లు, కథానుసారం మంచి గ్రాఫిక్స్ ఉండబోతున్నాయి.

అందుకే బాహుబలి, స్పైడర్ చిత్రాలకు గ్రాఫిక్స్ చేసిన హైదరాబాద్ బేస్డ్ మకుటా టీమ్ ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఇప్పటికే సంప్రదించింది.ఉయ్యాలవాడ మీద కూడా 100 కోట్ల బడ్జెట్ పెట్టి, సాంకేతిక విలువలతో తెరకెక్కెంచి, తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లోకొ విడుదల చేయాలనేది నిర్మాత రామ్ చరణ్ ప్లాన్.

మరి హిందీ పంపిణిదారులతో పాటు ప్రేక్షకులని ఆకర్షించాలంటే అక్కడ క్రేజ్ ఉన్న హీరోయిన్ కావాలిగా.దాంతోపాటు కథపరంగా, చిరంజీవి పాత్రకు తగ్గట్టుగా మధ్యవయసులో ఉండే హీరోయిన్ కావాలి.

అందుకే ఐశ్వర్యరాయ్ తో కొన్నిరోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారు.మొత్తానికి వీరి చర్చలు ముగిసాయని, ఐశ్వర్య సినిమా చేసేందుకు ఒప్పుకుందని సమాచారం.

ఈ సినిమా కోసం ఐశ్వర్యకి చెల్లించే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అక్షరాల 6 కోట్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube